తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విషనాగుల​తో దోస్తీ! ఆ ఊరందరికీ మస్తీ!

ఆ గ్రామంలో ఇళ్లకు తలుపులు ఉండవు. ఎందుకో తెలుసా..? వారి ప్రియమైన సాధుజీవులు​ ఇళ్లకు గస్తీ కాస్తాయి. కుక్కనో, పిల్లినో కాదు వారు పెంచేది. నాగు పాములను. దాదాపు 250 కుటుంబాలు తరతరాలుగా నాగులను ప్రాణంగా పెంచుకుంటున్నారు. ముద్దు పేర్లు పెట్టుకుని మరీ ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు వీరు.

విషనాగుల​తో దోస్తీ

By

Published : Jul 10, 2019, 7:48 AM IST

విషనాగుల​తో దోస్తీ
ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీకి 50 కి. మీల దూరంలో ఉన్న అధ్కటా బ్రహ్మనాన్​ గ్రామస్థులు అనాదిగా పాములను పెంచుతున్నారు. ఈ గ్రామంలో ఉన్న 250 ఇళ్లలో నిత్యం నాగులు సందడి చేస్తాయి. పెద్దలంతా వీటిని చిన్న పిల్లలతో సమానంగా చూసుకుంటారు. చిన్న పిల్లలకైతే వాటితో ఆడుకోవడమంటే మహా సరదా. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఏ ఇంటికి తలుపులు లేవు. నాగరాజుకి భయపడి ఏ దొంగా రాడని ఇక్కడి వారి నమ్మకం.

"అవును మా పూర్వీకుల నుంచి పాములు పెంచుతూ వస్తున్నాం. ఇవి మా జీవితంలో భాగమే. ఇక్కడ దాదాపు 250 ఇళ్లలో పాములు పెంచుతున్నారు. కానీ ప్రభుత్వం కొన్ని షరతులు విధించడం వల్ల కొంత మంది పెంచడంలేదు. మేము వీటికి మంత్రం వేస్తాము అందుకే అవి మమ్మల్ని కాటేయవు. మా ఇళ్లకు తలుపులు ఉండవు. పాములకు భయపడి దొంగలెవరూ ఇటు వైపు రారు."
-తేజ్​పాల్ నాథ్, గ్రామస్థుడు

ఇక్కడ నాగులు సందడిగా తిరుగుతూ ఉంటాయి తప్ప, ఎవ్వరికీ ఎలాంటి హాని కలుగజేయవు. యజమానులు వారి పాములకు ప్రేమగా స్నానం చేయించి లాలిస్తారు. అవి రాత్రి పూట ఎలుకలు, కప్పలు తినేసి కడుపు నింపుకుంటాయి.

"నేను పుట్టినప్పటి నుంచి పాములను చూస్తునే ఉన్నాను. వీటిని పిల్లలకంటే ఎక్కువగా చూసుకుంటాం. ఒక సారి నన్ను కాటేసింది. మా దగ్గరుండే నాలుగు గోలీలు వేసుకుంటే తగ్గిపోయింది. రాత్రి పూట వీటిని వదిలేస్తాము. అవి ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి."
-బస్తీ వాసి.

పాములను చూస్తే ఆమడదూరం పారిపోయేవారికి.. విషపూరితమైన మూగ జీవాలను సైతం ఎలా మచ్చిక చేసుకోవచ్చో ఈ ఊరి ప్రజలు తెలియజేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details