తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వర్షపాతం: ఐఎండీ, స్కైమెట్​​ అంచనాలు తలకిందులు..! - IMD, Skymet forecast contrary to initial prediction

గత 4 నెలల్లో దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. అయితే భారత వాతావరణ శాఖ, ప్రైవేటు సంస్థ స్కైమెట్ వెదర్ వేసిన ముందస్తు అంచనాలు స్వల్పంగా తప్పాయి. ఈ రెండు సంస్థల అంచనాల్లో చాలా తేడా కనిపించింది.

వర్షపాతం: ఐఎండీ, స్కైమెట్​​ అంచనాలు తలకిందులు..!

By

Published : Oct 2, 2019, 8:11 PM IST

Updated : Oct 2, 2019, 10:25 PM IST

భారత్​లో గత నాలుగు నెలల్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యింది. అయితే ఈసారి రుతుపవనాల విషయంలో భారత వాతావరణ శాఖ (ఐఎం​డీ), ప్రైవేటు సంస్థ స్కైమెట్​ వెదర్​ పరస్పర విరుద్ధంగా అంచనాలను వెల్లడించాయి.

ఏప్రిల్​లో ఐఎం​డీ... వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్​పీఏ) 96 శాతం ఉంటుందని, స్కైమెట్​ 93 శాతం ఉంటుందని అంచనా వేశాయి. నిజానికి ఈ రెండు సంస్థలూ ప్లస్ లేదా మైనస్​ 5 శాతం మార్జిన్​తో తప్పుడు అంచనాలను ఇచ్చాయి.

స్కైమెట్​ ఎల్​పీఏలో సాధారణం కన్నా తక్కువ లేదా సాధారణ వర్షపాతం కురుస్తుందని అంచనా వేసింది. అయితే ఇప్పుడు వర్షాలు ముగిశాయి. దీని ప్రకారం ఐఎం​డీ 10 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని ప్రకటించింది.

వివరణాత్మక విశ్లేషణ

భారత వాతావరణశాఖ వివరణాత్మక విశ్లేషణ చేస్తుందని ఐఎం​డీ డైరెక్టర్​ జనరల్ మోహపాత్ర స్పష్టం చేశారు. ఎల్​నినో తటస్థంగా మారడం, హిందూ మహాసముద్రం ద్విధ్రువం(ఐఓడీ) సానుకూలంగా మారడం లాంటి అంశాలను కచ్చితంగా అంచనా వేయగలిగామని ఆయన తెలిపారు. ప్రపంచంలోని మిగతా సంస్థలు తమ అంచనాలను మార్చినా ఐఎం​డీ మార్చలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుత డేటాను అంచనా వేస్తామని, కాలానుగుణంగా ఇందులో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని మోహపాత్ర చెప్పారు.

అంచనాలు తప్పాయ్..!​

వర్షపాతం సాధారణం కంటే అధికంగా కురవడంపై స్కైమెట్ వెదర్ ఉపాధ్యక్షుడు మహేష్​ పలావత్​ వివరణ ఇచ్చారు. ఎల్​నినో సాధారణంగా ఐఓడీని ముంచెత్తుంది. అయితే ఈసారి వేరే మార్గం పట్టిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలా సంస్థలు కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురుస్తుందని అంచనా వేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఇదీ చూడండి:ఈటీవీ భారత్​ "వైష్ణవ జన తో" గీతానికి ప్రధాని అభినందనలు

Last Updated : Oct 2, 2019, 10:25 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details