తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా రాకూడదని చెట్టెక్కిన తండ్రీకొడుకులు - Tree house build

కరోనా.. కరోనా... కొద్దిరోజులుగా ఎవరి నోట విన్నా ఇదే మాట. ఈ మహమ్మారిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించాలని దేశవ్యాప్తంగా ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలుచేశారు. కొవిడ్‌-19 బారినపడకుండా.. సమాజానికి మరింత దూరంగా ఉండాలనుకున్నారు ఉత్తర్​ప్రదేశ్​ హాపుడ్​లోని తండ్రీకొడుకులు. అందుకోసం ఇంటిని వదిలి, అడవికెళ్లి చెట్టుమీదే ఆవాసాన్ని ఏర్పరచుకున్నారు.

Hapur man builds Treehouse to maintain social distancing as COVID-19 spreads
భౌతిక దూరం పాటించేందుకు ఆ వ్యక్తి ఏం చేశాడంటే?

By

Published : Apr 10, 2020, 6:43 PM IST

కరోనా వ్యాప్తి నివారణకు భౌతిక దూరం చాలా ముఖ్యమైంది. అధికారులు ఈ మాటను పదే పదే చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాడు ఉత్తర్‌ప్రదేశ్‌ హాపుడ్​లోని అసుర్​ గ్రామానికి చెందిన త్యాగి. అందుకోసం ఇంటిని విడిచి అడవికి వెళ్లి ఓ చెట్టు మీదే చెక్కలు, కర్రల సాయంతో చక్కటి ఆవాసాన్ని(ట్రీ హౌస్‌) నిర్మించుకున్నాడు.

భౌతిక దూరం పాటించేందుకు ఆ తండ్రీకొడుకులు ఏం చేశారంటే..?

ప్రపంచ మహమ్మారిని అడ్డుకోవాలంటే భౌతిక దూరం తప్పనిసరి అని చెప్పిన త్యాగి.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా తన కుమారుడి సాయంతో చెట్ల కాండాలను పోగుచేసి ఈ ట్రీహౌస్​ను ఏర్పరచుకున్నట్టు వివరించాడు.

భోజనం ఇంటి నుంచే..

అడవుల్లో నివసించడం వల్ల ప్రకృతికి మరింత దగ్గరవుతున్నామని చెప్పుకొచ్చాడు త్యాగి కుమారుడు. ఇక్కడ పరిసరాలు చాలా శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. భోజన సదుపాయాలు మాత్రం ఇంటి నుంచే వస్తున్నట్లు తెలిపారీ తండ్రీకొడుకులు.

ఇదీ చదవండి:మాస్క్‌లేకుండా బయటకొచ్చారు.. అలా బుక్కయ్యారు!

ABOUT THE AUTHOR

...view details