జమ్ముకశ్మీర్‌లో నేటి నుంచి సరికొత్త అంకం మొదలైంది. ఇంతవరకు కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో పాటు పునర్విభజన బిల్లు ఆమోదంతో ఆ రాష్ట్రం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది.
నవ కశ్మీరం: పునర్విభజన తర్వాత పాలన ఇలా... - JK latest News
ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, ఎమ్మెల్యేలకు ఆరేళ్ల పదవీకాలం...! ఇలా జమ్ముకశ్మీర్‌కు ఒకప్పుడు అన్నీ ప్రత్యేకమే. మోదీ సర్కార్ 'రద్దు' అస్త్రంతో లెక్కమారింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన పునర్విభజన చట్టంతో రాష్ట్ర స్వరూపమూ మారింది. జమ్ముకశ్మీర్... రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. పునర్విభజన చట్టం ప్రకారం కశ్మీర్‌లో పలు కీలక మార్పులు వచ్చాయి. అవేంటో చూద్దాం.

నవ కశ్మీరం: పునర్విభజన తర్వాత పాలన ఇలా...
జమ్ముకశ్మీర్ శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లద్దాఖ్ శాసనసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా మారాయి. కొత్తగా ఏర్పాటైన కశ్మీర్‌లో శాసనసభ స్థానాలు పెరగనున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 24 స్థానాలతో కలుపుకొని జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకు మొత్తం 107 శాసనసభ స్థానాలుండేవి. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ అనంతరం మరో ఏడు స్థానాలు జత అయ్యి 114 కానున్నాయి.
పునర్విభజనతో జరిగే మార్పులు
- జమ్ముకశ్మీర్ శాసనసభ గల కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది.
- లద్దాఖ్ శాసనసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది.
- పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతానికి చెందిన 24 శాసనసభ స్థానాలు గతంలో వలే ఖాళీగా ఉంటాయి.
- లద్దాఖ్‌లో కార్గిల్, లేహ్ జిల్లాలు ఉంటాయి.
- శాసనసభ సభ్యుల సంఖ్యలో 10 శాతానికి మించకుండా జమ్ముకశ్మీర్‌కు ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఉంటుంది.
- పరిపాలనలో గవర్నర్‌కు మంత్రిమండలి సహాయ సహకారాలు అందిస్తుంది.
- శాసనసభకు చట్టాలు చేసే అధికారం ఉంటుంది.
- రాజ్యాంగాన్ని అనుసరించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వుడు స్థానాలుంటాయి.
- లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఇద్దరు శాసనసభ్యులను నామినేట్ చేసే అధికారం ఉంటుంది. సభలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే మహిళా సభ్యులను ఆయన నామినేట్ చేయవచ్చు.
- జమ్ముకశ్మీర్‌లో ఐదు, లద్దాఖ్‌లో ఓ లోక్‌సభ స్థానం ఉంటుంది. నవ కశ్మీరం: పునర్విభజన తర్వాత పాలన ఇలా...