తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా లభ్యత, పంపిణీ వ్యూహాలపై కేంద్ర మంత్రుల భేటీ

కరోనా టీకా లభ్యత, పంపిణీ కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలోని మంత్రుల బృందం. దేశంతో పాటు అంతర్జాతీయ కరోనా పరిస్థితినీ సమీక్షించింది. దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో ప్రజారోగ్య వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని.. అందుకే మరణాల రేటు అదుపులో ఉందన్నారు హర్షవర్ధన్.

GOM CORONA
మంత్రుల బృందం

By

Published : Oct 13, 2020, 6:38 PM IST

దేశంతో పాటు అంతర్జాతీయంగా కరోనా పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ నేతృత్వంలోని మంత్రుల బృందం భేటీ అయింది. 2021 జులై నాటికి వ్యాక్సిన్ల లభ్యత, పంపిణీ కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు సమాలోచనలు చేశారు.

ఈ సందర్భంగా నెలల తరబడి కరోనాపై పోరులో సేవలందిస్తున్న యోధులకు కృతజ్ఞతలు తెలిపారు హర్షవర్ధన్. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రజారోగ్య వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని ఆయన అన్నారు.

రికవరీ రేటు..

దేశంలో 62.27 లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం వల్ల 86.78శాతంతో ప్రపంచంలోనే అత్యధిక రికవరీ రేటు సాధించగలిగామని హర్షం వ్యక్తం చేశారు హర్షవర్ధన్. మరణాల రేటు కూడా అతి తక్కువ స్థాయిలో 1.53శాతం నమోదైందని తెలిపారు. దేశంలో 1,927 ల్యాబుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రానున్న పండుగ సీజన్​తో పాటు శీతాకాలంలోనూ ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు హర్షవర్ధన్. ఈ సమయాల్లో వ్యాధి ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు.

టీకా పంపిణీపై..

భారత్​తోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకా తయారీకి సంబంధించిన అంశాలను నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వినోద్ పాల్.. మంత్రులకు వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాలోని సీడీసీ సిఫార్సులకు అనుగుణంగా ఎవరెవరికి ప్రాధాన్య క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వాలో కూడా వివరంగా తెలియజేశారు.

టీకా నిల్వలకు సంబంధించి కోల్డ్ స్టోరేజీల గుర్తింపు, నిల్వ కేంద్రంలో ఉష్ణోగ్రత, ఆరోగ్య కేంద్రాల జియో ట్యాగింగ్, డాష్ బోర్డ్ అందుబాటులో ఉంచడం ద్వారా టీకా సరఫరాను వేగవంతం చేసే చర్యలను వివరించారు పాల్. ఆరోగ్య సిబ్బంది జాబితా ఈ నెల ఆఖరు లేదా నవంబర్ తొలినాళ్లలో పూర్తవుతుందన్నారు. అదే సమయంలో డిజిటల్ వేదికల లెక్కింపు, వ్యాక్సినేతర సరఫరాల వంటివి ప్రణాళికలో భాగంగా ఉంటాయని తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా ఇంకా ఉంది.. అలసత్వం వద్దు: మోదీ

ABOUT THE AUTHOR

...view details