జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. డయల్గావ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ముష్కరుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో డయల్గావ్ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. ఈ నేపథ్యంలో బలగాలపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. వారికి దీటుగా బదులిచ్చాయి బలగాలు. నలుగురిని మట్టుబెట్టాయి.