విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి, భాజపా సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆమె మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సుష్మా స్వరాజ్ మృతి దేశానికి తీరని లోటు అని వరస ట్వీట్లు చేశారు.
"భారత రాజకీయాల్లో ఒక అద్భుత అధ్యాయం ముగిసింది. ప్రజా సేవ, పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకురాలి మృతికి దేశం దుఃఖిస్తోంది. కోట్లాది మందికి ఆదర్శనీయం సుష్మా. భాజపా సిద్ధాంతాలు, ప్రయోజనాల కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆమె మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతి శాఖను ఉన్నతంగా నిలిపారు. విదేశాలతో భారత్ సంబంధాలను మెరుగుపరిచారు. ప్రపంచ నలు మూలలా కష్టాల్లో ఉన్న భారతీయులకు ఎల్లవేళలా అండగా నిలిచారు. సుష్మాస్వరాజ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.''
-నరేంద్ర మోదీ, ప్రధాని
రాష్ట్రపతి సంతాపం
సుష్మా స్వరాజ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రేమించే నాయకురాలిని కోల్పోయామని ట్వీట్ చేశారు.
"సుష్మా స్వరాజ్ మరణవార్త వినగానే షాక్కు గురయ్యా. గౌరవం, ధైర్యం, సమగ్రతకు చిరునామా అయిన ప్రజలు ప్రేమించే గొప్ప నాయకురాలిని దేశం కోల్పోయింది. ఇతరులకు సాయం అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండేవారు. ప్రజలకు ఆమె చేసిన సేవలకుగానూ చిరస్థాయిగా గుర్తుండిపోతారు."
-రామ్నాథ్ కోవింద్ ట్వీట్, రాష్ట్రపతి
వెంకయ్య నివాళి