తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెరువులోకి దూసుకెళ్లిన కారు... ఐదుగురు బలి

మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

car
చెరువులోకి దూసుకెళ్లిన కారు

By

Published : Feb 3, 2020, 10:51 AM IST

Updated : Feb 28, 2020, 11:46 PM IST

చెరువులోకి దూసుకెళ్లిన కారు... ఐదుగురు బలి

మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు గాయపడ్డారు.

ఈ రోజు తెల్లవారుజామున అత్పాదీ తెహ్సిల్​ మండలంలోని పరేకర్​వాడీ గ్రామంలో రోడ్డు వెంబడి ఉన్న ఓ చెరువులోకి ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. వాహనంలో డ్రైవర్​తో సహా మరో ఐదుగురు ఉన్నారు. కారు లోపల ఇరుక్కున వారు తలుపులను తెరుద్దామని ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. దీంతో వారు లోపలే ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు మాత్రం తలుపు అద్దాలు పగలుగొట్టుకుని బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు కారును జేసీబీ సాయంతో బయటికి లాగారు. మృతదేహాలను పోస్టు​మార్టమ్​ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : పెళ్లి నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం- 10 మంది మృతి

Last Updated : Feb 28, 2020, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details