ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్న కేంద్రం అభ్యర్థనపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ వ్యాజ్యంపై వచ్చే వారం విచారణ జరపాలని త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద అరెస్టుపై ఉన్న కఠిన నిబంధనలను సడలిస్తూ 2018 మార్చి 20న అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పు సమస్యాత్మకంగా ఉందని.. కోర్టు సమీక్షించాలని అభ్యర్థించింది కేంద్రం. దీనిపై విచారించిన సుప్రీం.. తీర్పును ఈ ఏడాది మే 1న రిజర్వులో ఉంచింది.