తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాచించే రోజులు పోయాయ్​.. ఇంటికి చేరిన ఇంజినీర్​

ఇంజినీరింగ్​​ చదివి యాచకుడిగా మారిన శంకర్​ కథ గుర్తుందా..? ఆ.. ఆ రిక్షా కార్మికుడితో జరిగిన గొడవ వల్లే శంకర్​కు మళ్లీ మంచి రోజులొచ్చాయి. యాచక జీవితం నుంచి విముక్తి లభించింది. వార్తా కథనాల పుణ్యమా అని ఏళ్ల తరువాత తిరిగి ఇల్లు చేరుకున్నాడు.

Engineer who was found begging taken back home in odisha
యాచించే రోజులు పోయాయ్​.. ఇంటికి చేరిన ఇంజినీర్​

By

Published : Jan 20, 2020, 10:20 AM IST

Updated : Jan 20, 2020, 12:45 PM IST

యాచించే రోజులు పోయాయ్​.. ఇంటికి చేరిన ఇంజినీర్​

ఒడిశా పూరీలో యాచకుడిగా మారిన ఇంజినీరు​​ గిరిజా శంకర్​ మిశ్రా కథ సుఖాంతమైంది. వార్తా కథనాలకు స్పందించిన కుటుంబ సభ్యులు శంకర్​ను ఇంటికి తీసుకెళ్లారు.

మాజీ డీఎస్​పీ కొడుకు గిరిజా శంకర్​ మిశ్రా ఇంజినీరింగ్​​ పట్టభద్రుడు. కానీ, అనివార్య కారణాల వల్ల ఒడిశా పూరీజగన్నాథ స్వామి ఆలయం వద్ద యాచకుడిగా మారాడు. తాజాగా ఓ రిక్షా కార్మికుడితో శంకర్​కు గొడవైంది. ఇద్దరిమధ్య బాహాబాహీ జరిగింది. పోలీస్ స్టేషన్​కు వెళ్లిన శంకర్​ చక్కటి ఇంగ్లీష్​లో ఫిర్యాదు రాసిచ్చాడు. శంకర్​ ఆంగ్ల భాష నైపుణ్యం చూసి కంగుతిన్న పోలీసులు.. అతడి గురించి ఆరా తీశారు. అప్పుడే శంకర్​ అసలు కథ బయటపడింది.

ఆ తరువాతా వార్తా పత్రికలు, ఛానెళ్లు శంకర్​ గురించి విస్తృతంగా కథనాలు ప్రసారం చేశాయి. ఈ వార్త చూసిన కుటుంబసభ్యులు వెంటనే వెళ్లి మిశ్రాను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భువనేశ్వర్​, నీలాద్రి విహార్​లోని తన స్వస్థలానికి చేరుకున్నాడు శంకర్​.

ఇదీ చదవండి:మసీదులో అంగరంగ వైభవంగా హిందూ పెళ్లి

Last Updated : Jan 20, 2020, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details