తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇది స్కూల్​ బస్​ కాదు... ఈ బస్సే స్కూల్! - గురుగ్రామ్

ఆ స్కూలు నడి రోడ్డుపై తిరుగుతుంది. విద్యార్థులు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్తుంది. విద్యతోపాటు పాఠ్యపుస్తకాలు, ఏకరూపు దుస్తులు... ఇలా అవసరమైనవన్నీ అందిస్తుంది. అదీ ఉచితంగా..!

ఇది స్కూల్​ బస్​ కాదు... ఈ బస్సే స్కూల్!

By

Published : Sep 3, 2019, 5:32 AM IST

Updated : Sep 29, 2019, 6:08 AM IST

ఇది స్కూల్​ బస్​ కాదు... ఈ బస్సే స్కూల్!
హరియాణా గురుగ్రామ్​లో బడికి దూరమైన పిల్లల కోసం బస్సునే బడిగా మలచి, విద్యాబోధన చేస్తున్నారు సందీప్ ​రాజ్​పుత్.

పేదరికం కారణంగా బంగారు భవిష్యత్ కోల్పోతున్న ఎందరో పిల్లలకు ఓ దారి చూపాలన్న సందీప్​ ఆశయం నుంచి పుట్టింది ఈ ఆలోచన. విద్యా దానాన్ని మించినదానం లేదని విశ్వసించిన మరింత మంది... స్వచ్ఛందంగా పాఠాలు చెప్పేందుకు తరలివచ్చారు. గొప్ప కార్యానికి మెచ్చి ఎందరో దాతలు తోచినంత సాయాన్ని అందించారు.

ఇప్పుడు గురుగ్రామ్​లో ఇలాంటి మొబైల్ పాఠశాలలు ఐదు ఉన్నాయి. ఒక్కో బస్సులో 60 మంది విద్యార్థులు కూర్చుని, పాఠాలు వినేలా బల్లలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు నడిచే ఈ బడిలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి లోపున్న బాలబాలికలు.. దాదాపు 300 మంది ఉన్నారు. పిల్లలకు కావలసిన పాఠ్యపుస్తకాలు, ఏకరూపు దుస్తులు వంటివి సంచార పాఠశాల నిర్వాహకులు అందజేస్తారు.

"ఈ సామాజిక కార్యక్రమం ప్రారంభించే ముందు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. పిల్లలకు దుస్తులు, భోజనం, పుస్తకాలు వంటివి ఇవ్వాలి. కానీ... అవన్నీ నేనొక్కడినే చేయలేను. ఇలాంటి ఆలోచనలున్న ఎంతో మంది నాకు సహాయపడ్డారు. దగ్గర్లోని సోసైటీలో ఉండే వారు కొందరు పుస్తకాలు, దుస్తులు ఇచ్చి వెళ్తారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన గీత వంటివారు పిల్లలకు విద్య బోధిస్తున్నారు.​"
-సందీప్​ రాజ్​పుత్, సంచార పాఠశాలల నిర్వాహకుడు

ఫీజు భారాలు, రవాణా ఖర్చులు లేకుండానే తమ పిల్లలు చదువుకుంటున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు.

ఇదీ చూడండి:'గణేశుడి సైకత శిల్పం'తో ప్లాస్టిక్​పై యుద్ధం!

Last Updated : Sep 29, 2019, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details