తెలంగాణ

telangana

By

Published : May 24, 2020, 5:18 PM IST

ETV Bharat / bharat

అంపన్​ ఎఫెక్ట్​: పుస్తక ప్రియుల కలలపై వరద నీళ్లు

బంగాల్​లో బీభత్సం సృష్టించిన అంపన్​ తుపాను కారణంగా.. కోల్​కతాలోని కాలేజ్​ స్ట్రీట్​ మెత్తం వరద నీరు చేరింది. ఫలితంగా లక్షల రూపాయల విలువైన పుస్తకాలు నీటమునిగాయి. ఈ దశ్యాలు పుస్తక ప్రియులను కలచివేశాయి.

Cyclone Amphan inundates Kolkatas College Street, drowns dreams of thousands of book lovers
కాలేజ్​ స్ట్రీట్​

పెను తుపాను అంపన్​ కోల్​కతాలోని పుస్తకాల మార్కెట్లకు ప్రఖ్యాతి గాంచిన కాలేజ్​ స్ట్రీట్​పై తీవ్ర ప్రభావం చూపింది. వరద ధాటికి పుస్తకాల షాపులు ఎక్కడికక్కడ పూర్తిగా నీటమునిగాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల విలువైన పుస్తకాలు నీటిపాలయినట్లు అధికారులు తెలిపారు.

కాలేజ్​ స్ట్రీట్​

అంపన్​ తుపాను కారణంగా బంగాల్​, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన విధ్వంసాన్ని అంచనా వేస్తున్న సమయంలో కనిపించిన ఈ దృశ్యాలు.. అనేక మంది పుస్తక ప్రియులను కలతచెందేలా చేశాయి.

కాలేజ్​ స్ట్రీట్​

అతిపెద్ద మార్కెట్​...

ఆసియాలోనే అతిపెద్ద పుస్తక మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచింది కాలేజ్​ స్ట్రీట్​. ఈ ప్రాంతానికి సమీపంలో ఎన్నో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది.

కాలేజ్​ స్ట్రీట్​
వరద నీరు తొలగిస్తున్న షాపు యజమాని
పస్తకాల షాపుల్లోకి చేరిన వరద నీరు

ABOUT THE AUTHOR

...view details