సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 82వ రైజింగ్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సీఆర్పీఎఫ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు సీఆర్పీఎఫ్ జవాన్లు ముందుండి పోరాడుతున్నారని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.
ముందుండి దేశాన్ని రక్షిస్తున్న సీఆర్పీఎఫ్ "సీఆర్పీఎఫ్ 82వ రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సీఆర్పీఎఫ్ ముందు వరసలో ఉండి మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతోంది. మీ శక్తి, ధైర్యం, వృత్తి నైపుణ్యం దేశప్రజల మన్ననలను అందుకుంటున్నాయి. మున్ముందు సీఆర్పీఎఫ్ మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతుంది."
- ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
నిబద్ధతకు పర్యాయపదం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా సీఆర్పీఎఫ్ జవాన్లకు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రత పట్ల అంకితభావం, విధి నిర్వహణ, నిబద్ధతలకు సీఆర్పీఎఫ్ పర్యాయపదమని ఆయన అభివర్ణించారు.
అంకిత భావానికి, నిబద్ధతకు సీఆర్పీఎఫ్ పర్యాయపదం ఘన చరిత్ర
1939 జులై 27న 'క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీసు' పేరుతో సీఆర్పీఎఫ్ ప్రారంభమైంది. 1949 డిసెంబర్ 28న సీఆర్పీఎఫ్ చట్టం ప్రకారం, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్)గా మారింది. దేశ అంతర్గత భద్రత కోసం సీఆర్పీఎఫ్ అనితరసాధ్యమైన రీతిలో కృషి చేస్తోంది.
ఇదీ చూడండి:రాష్ట్రపతికి పదో తరగతి కుర్రాడు లేఖ.. ఎందుకంటే?