తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్... జాబిల్లి ఛాయాచిత్రాలు పంపెన్

చంద్రయాన్-2 వ్యోమనౌక తీసిన జాబిల్లి ఛాయాచిత్రాలను విడుదల చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). వ్యోమనౌకలోని టెర్రైన్​-2 కెమెరా చంద్రుడికి 4375 కిలోమీటర్ల దూరం నుంచి ఈ ఫొటోలు తీసిందని ప్రకటించింది.

జాబిల్లి ఫొటోలు తీసిన చంద్రయాన్-2

By

Published : Aug 26, 2019, 9:12 PM IST

Updated : Sep 28, 2019, 9:25 AM IST

ఆగస్టు 20న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-2 వ్యోమనౌక... 23వ తేదీన తీసిన చంద్రుడి చిత్రాలను తాజాగా విడుదల చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో). ఆర్బిటార్​లోని టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా-2 ఈ చిత్రాలను తీసిందని వెల్లడించింది.

ఆగస్ట్ 23వ తేదీన చంద్రయాన్‌ -2లో ఉన్న టెర్రైన్ కెమెరా 4375 కిలోమీట‌ర్ల దూరం నుంచి ఈ ఫొటోలు తీసినట్లు ట్విట్టర్​ వేదికగా పేర్కొంది ఇస్రో. జాక్సన్, మాచ్, కొరలేవ్, మిత్రా అనే బిలాలు ఛాయాచిత్రాల్లో కనిపించినట్లు స్పష్టం చేసింది. శాస్త్రవేత్త సిసిర్​కుమార్ మిత్రా పేరుమీద ఓ బిలానికి గతంలో ఆయన పేరు పెట్టినట్లు ఇస్రో ట్వీట్‌లో పేర్కొంది.

ఇదీ చూడండి: ట్రంప్ చెణుకుకు మోదీ సమాధానమేమిటో తెలుసా!

Last Updated : Sep 28, 2019, 9:25 AM IST

ABOUT THE AUTHOR

...view details