తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.1,038 కోట్ల నల్లధనం బదిలీ గుట్టురట్టు - నల్లధనం గుట్టురట్టు చేసిన సీబీఐ

హాంకాంగ్​కు నల్లధనం బదిలీ చేశారనే ఆరోపణలతో 51 సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2014-15 సమయంలో మొత్తం రూ.1038 కోట్ల నల్లధనం బ్యాంకుల ద్వారా బదిలీ అయినట్లు అధికారులు వెల్లడించారు.

cbi-books-51-entities
రూ.1,038 కోట్ల నల్లధనం బదిలీ గుట్టురట్టు

By

Published : Jan 6, 2020, 8:04 PM IST

హాంకాంగ్​కు నల్లధనం ట్రాన్స్​ఫర్​ ఆరోపణలపై చెన్నై వ్యక్తులకు చెందిన 51 సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2014-15 సమయంలో మొత్తం రూ.1038 కోట్ల నల్లధనం బదిలీ చేశారని పేర్కొంది. తమిళనాడులోని బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఎస్​బీఐ, పంజాబ్​ నేషనల్​ బ్యాంకు శాఖలకు చెందిన గుర్తుతెలియని అధికారుల సాయంతో రహస్యంగా ఈ అక్రమానికి పాల్పడినట్లు అధికారులు వివరించారు.

అక్రమాలకు పాల్పడ్డ 48 సంస్థలకు చెందిన 51 సంస్థల ప్రస్తుత బ్యాంకు ఖాతాల వివరాలు సంపాదించినట్లు పేర్కొన్నారు సీబీఐ అధికారులు. బీఓఐ, ఎస్​బీఐ, పీఎన్​బీకి చెందిన శాఖలలోనే సదరు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు.

48 సంస్థలతో పాటు మహ్మద్​ ఇబ్రామ్సా జానీ, జింతా మిదర్​, నిజాముద్దీన్​ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లను ఎఫ్​ఐర్​లో చేర్చారు. ఇందులో 24 కంపెనీలు దిగుమతులు చేసుకున్న వస్తువుల విలువ.. బ్యాంకులకు సమర్పించిన డేటాతో సరిపోలడం లేదన్నారు అధికారులు.

ఈ అక్రమానికి పాల్పడిన నిందితులతో పాటు సహాయపడిన వారికి.. బదిలీ చేసిన మొత్తం ఆధారంగా కమీషన్​ అందినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు అధికారులకూ లంచం ఇచ్చినట్లు ఎఫ్​ఐర్​లో పేర్కొన్నారు.

ఇందులో ఎక్కువ మొత్తం బదిలీ 2015 రెండో అర్ధ భాగంలో జరిగినట్లు.. కోట్ల రూపాయల మేర బదిలీ జరిగితే... లక్షల్లో లెక్క చూపినట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details