తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2019, 11:45 AM IST

Updated : Dec 19, 2019, 4:38 PM IST

ETV Bharat / bharat

'పౌర' ఆందోళనలు ఉద్ధృతం... పలు చోట్ల కర్ఫ్యూ

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. దిల్లీలో ఎర్రకోట సహా, దేశంలోని ప్రధాన నగారాల్లో 144 సెక్షన్ విధించారు. మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ఏకమై నిరసన కార్యక్రమం చేపట్టనున్నాయి.

caa-protests-across-india
దేశ వ్యాప్తంగా పౌర ఆందోళనలు... ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ

'పౌర' ఆందోళనలు ఉద్ధృతం... పలు చోట్ల కర్ఫ్యూ

పలు రాష్ట్రాల్లో పౌరసత్వ చట్టసవరణకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. నిరసనల దృష్ట్యా దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 14 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. ఉత్తర్​ప్రదేశ్​ లఖ్‌నవూలోనూ పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. కొన్నిచోట్ల సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఆంక్షలను లెక్కచేయకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

బిహార్​లో రైల్​రోకో..

పౌరచట్టానికి వ్యతిరేకంగా బిహార్​ రాజధాని పట్నాలో ఏఐఎస్​ఎఫ్​ విద్యార్థి సంఘం ఆందోళనలు చేపట్టింది. రాజేంద్ర నగర్​ రైల్వే స్టేషన్​లో రైల్వే ట్రాక్​పై నిరసనలు చేపట్టి రైల్ రోకో నిర్వహించింది.

దర్భాంగాలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైల్​రోకో నిర్వహించారు.

కర్ణాటకలో బంద్​...

కర్ణాటకలోనూ పౌర చట్ట వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాష్ట్రవ్యాప్త బంద్​కు పిలుపునిచ్చాయి వామపక్షాలు, ముస్లిం వర్గాలు. ఈ నేపథ్యంలో బెంగళూరులో 144 సెక్షన్ విధించారు అధికారులు.

చండీగఢ్​లో నిరసనలు..

పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ చండీగఢ్​లో ముస్లిం వర్గాలు నిరసనలు చేపట్టాయి.

మహా ర్యాలీ..

మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్​ సహా ఇతర పార్టీలు ఏకమై పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించనున్నాయి.

బంగాల్, అసోం ప్రశాంతం..

బంగాల్​, అసోంలో పౌరసత్వ చట్ట సవరణ వ్యతిరేక నిరసనలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.

Last Updated : Dec 19, 2019, 4:38 PM IST

ABOUT THE AUTHOR

...view details