జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ).. దేశవ్యాప్తంగా అమలు చేసి అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఎన్ఆర్సీపై అనేక సందర్భాల్లో భాజాపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అయితే.. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో భాజపా వెనక్కి తగ్గిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. విమపక్షాల విమర్శలు, ప్రజల నుంచి ఎదురవుతోన్న వ్యతిరేకతతో ఎన్ఆర్సీ దేశవ్యాప్త అమలుపై పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది భాజపా.
ఊతమిస్తోన్న ప్రధాని ప్రకటన..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎన్ఆర్సీ దేశవ్యాప్త అమలుపై భాజపా వెనక్కి తగ్గిందనే ఆలోచనలకు ఊతమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఏనాడూ చర్చించలేదని ప్రకటించారు మోదీ. ప్రధాని ప్రసంగంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. కేంద్ర హోంమంత్రి దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీని అమలు చేసి తీరుతామని పలు సందర్భాల్లో స్పష్టం చేశారని.. దానికి విరుద్ధంగా ప్రధాని మాట్లాడుతున్నారని ఆరోపించాయి. పౌర చట్టంపై ఆందోళనల నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు భాజపా అసత్యాలు చెబుతోందని పేర్కొన్నాయి.
అసోంతో గందరగోళం..