కర్ణాటకలో మరోసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. ఆ పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వాజూభాయ్ వాలా యడ్యూరప్పతో ప్రమాణం చేయించారు.
నేడు యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణం చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం.