భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విషయంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా గజగజ వణికారని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు ఇటీవల స్వయంగా వెల్లడించారు. అయితే సదరు వీడియోను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా.
"భారత్, దేశ సైన్యం, ప్రభుత్వం, పౌరులు ఇలా ఎవరు ఏం చెప్పినా కాంగ్రెస్ యువరాజు (రాహుల్ గాంధీ) నమ్మరు. ఆయన ఎంతగానో నమ్మే ఆ దేశానికి (పాక్) సంబంధించిన వ్యక్తి ఏం చెబుతున్నారో చూడండి. ఇప్పటికైనా ఆయన కళ్లు తెరుస్తారేమో!"
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
రాహుల్ గాంధీ 2019 లోక్సభ ఎన్నికల ప్రచారంలో దేశ సైన్యాన్ని బలహీనపరిచేలా ఎన్నో వ్యాఖ్యలు చేశారని నడ్డా ఆరోపించారు. భారత సైన్యం ధైర్యాన్నీ, శక్తిని ప్రశ్నించారన్నారు. వాయుసేనకు రఫేల్ విమానాలు అందకుండా ఉండాలని రాహుల్ ఎన్నో అడ్డంకులు సృష్టించారని నడ్డా విమర్శించారు. ఆ పన్నాగాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, కాంగ్రెస్కు ఘోర ఓటమి మిగిలిందని నడ్డా అన్నారు.