తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాత వస్త్రాల సంచుల తయారీతో ప్లాస్టిక్​పై పోరు - భోపాల్ ప్లాస్టిక్

మధ్యప్రదేశ్​లోని భోపాల్​ నగరపాలక సంస్థ ప్లాస్టిక్​పై వేటు వేసేందుకు వినూత్న ఆలోచన చేసింది. పాత దుస్తులతో సరికొత్తగా సంచులు తయారు చేసి.. సరసమైన ధరలకే వినియోగదారులకు అందిస్తోంది. ప్లాస్టిక్​ రహిత నగరాన్ని తీర్చిదిద్దేంకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చింది.

Bhopal Municipal Corporation (BMC) started a unique and inspiring anti-plastic drive in the month of September.
ప్లాస్టిక్​ ఎందుకు దండగా.. పాత వస్త్ర సంచులు ఉండగా

By

Published : Jan 12, 2020, 7:32 AM IST

పాత వస్త్రాల సంచుల తయారీతో ప్లాస్టిక్​పై పోరు

దశాబ్దాల క్రితం.. మానవాళి జీవితంలోకి ప్లాస్టిక్​ ప్రవేశించకముందు ఎంతటి వారైనా.. నిత్యవసరాలు, ఇతర ఏ వస్తువులైనా తెచ్చుకోవాలంటే ఓ సంచితో బజారుకు బయల్దేరేవారు. అదే పద్ధతిని వినియోగించి ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయ మార్గం చూపుతోంది మధ్యప్రదేశ్​లోని భోపాల్​ నగర పాలక సంస్థ.

నగరాన్ని ప్లాస్టిక్​ రహితంగా తీర్చిదిద్దేందుకు గత సెప్టెంబర్​లో నగరంలోని పలు ప్రాంతాల్లో పాత దుస్తులతో సంచులు తయారు చేసే కేంద్రాలు ఏర్పాటు చేసింది. కేవలం 5 రూపాయలకే ఈ సంచులను అందిస్తూ ప్లాస్టిక్​ వాడకంపై అవగాహన కల్పిస్తోంది. వీటి ద్వారా ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయమే కాదు.. మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.

అయితే ప్రస్తుతం ఈ సంచులను కొనుగోలు చేసేందుకు కొంత మేర నామూషీగా భావిస్తున్నప్పటికీ.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అంటున్నారు తయారీ కేంద్ర నిర్వాహకురాలు రబియా.

"ఇక్కడికి ప్లాస్టిక్ తీసుకువచ్చే వారి నుంచి మేము వాటిని​ స్వీకరిస్తాం. కార్యక్రమానికి మొదట్లో కంటే ఇప్పుడు స్పందన పెరిగింది. కానీ, ఈ వస్త్ర సంచులను కొనుగోలు చేయడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. పాత బట్టలతో కుట్టిన ఈ సంచులను తీసుకునేందుకు మొహమాటపడుతున్నారు. ఈ సంచి ధర కేవంలో 5 రూపాయలు. ఒకవేల వారు పాత దుస్తులు ఇస్తే ఆ డబ్బు కూడా తిరిగిచ్చేస్తాం. సంచులు తీసుకోని వారు కూడా.. ఇక్కడికి వచ్చి ప్లాస్టిక్ ఇచ్చి ఈ ఆలోచన బాగుందని ప్రశంసిస్తున్నారు. రోజూ కనీసం 5 నుంచి 10 సంచులు అమ్ముతాం. ఈ కార్యక్రమం ప్లాస్టిక్​పై చాలా ప్రభావం చూపింది."

-రబియా, కార్మికురాలు

ప్లాస్టిక్​ సంహారమే లక్ష్యం...

ఇంట్లో అనవసరంగా పడి ఉండే పాత దుస్తులను ఇలా రీసైకిల్​ చేయడం వల్ల.. ప్లాస్టిక్​ వ్యర్థాలను తగ్గించి ప్రకృతిని కాపాడుకోవచ్చంటున్నారు అధికారులు.

గత మూడేళ్లుగా స్వచ్ఛ నగరంగా అవార్డులందుకుంటూ.. భారత దేశానికే స్వచ్ఛ రాజధానిగా పేరుపొందిన భోపాల్​ నగరం ఇలా సరికొత్త ఆలోచనతో మరోసారి మన్నన్నలు పొందుతోంది. ప్లాస్టిక్ ​సంహారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తోంది.

ఇదీ చదవండి:పాఠశాలలోనే విద్యార్థులకు క్షౌరం.. ఎందుకో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details