తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2019, 3:46 PM IST

Updated : Apr 16, 2019, 5:21 PM IST

ETV Bharat / bharat

ఎన్నికల వేళ జేడీఎస్​ నేతలపై ఐటీ దాడులు

కర్ణాటకలోని మండ్య, హాసన్​ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. అందులో జేడీఎస్​ నేతల నివాసాలు ఉన్నాయి. మండ్య నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి మనుమడు నిఖిల్​, హాసన్​ నుంచి జేడీఎస్​ కీలక  నేత రేవణ్న కుమారుడు ప్రజ్వల్​ పోటీ చేస్తున్నారు.

జేడీఎస్​ నేతల ఇళ్లపై ఐటీ దాడులు

జేడీఎస్​ నేతల ఇళ్లపై ఐటీ దాడులు

కర్ణాటకలోని మండ్య, హాసన్​ లోక్​సభ నియోజకవర్గాల పరిధిలోని కొందరు జేడీఎస్​ నేతలు, సంబంధీకుల నివాసాలు, పరిశ్రమలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. మండ్య జిల్లా పరిషత్​ అధ్యక్షుడు, జేడీఎస్​ నేత నాగరత్న స్వామికి చెందిన రెండు ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జడ్పీ సభ్యుడైన ఆదే పార్టీకి చెందిన మరో నాయకుడి ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

మండ్య, హాసన్ లోక్​సభ నియోజకవర్గాల నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ మనుమళ్లు నిఖిల్, ప్రజ్వల్​​ పోటీలో ఉన్నారు.

4 బృందాలు, 60 మంది అధికారులు

60 మంది ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి బెంగళూరు, హాసన్​, మండ్యలో 12 చోట్ల విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. వారికి సీఆర్పీఎఫ్​ సిబ్బంది రక్షణగా వచ్చారు. పన్ను ఎగవేతకు పాల్పడి, నల్లధనం కూడబెట్టారనే సమాచారంతోనే సోదాలు చేస్తున్నామని ఐటీ అధికారులు చెబుతున్నారు.

"కొందరు వ్యాపార వేత్తలు పన్ను ఎగవేస్తున్నారని, అక్రమ ఆస్తులు కూడబెట్టారనే కచ్చితమైన సమాచారంతో సోదాలు చేస్తున్నాం. స్థిరాస్తి​, గనులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, పెట్రోల్​ బంకుల నిర్వాహకులు, మిల్లులు నడుపుతున్న కొందరు వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నాం. ఈ రంగాల్లో నల్లధనం ఎక్కువగా చెలామణి అవుతోందని తెలుస్తోంది"

-- ఆదాయపు పన్ను శాఖ అధికారి

కక్షపూరితంగా కేంద్రం తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని సీఎం కుమారస్వామి గత నెల 28న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వరతో కలిసి ధర్నాకు దిగారు. ఈ అంశంపై జేడీఎస్​-కాంగ్రెస్​, భాజపా నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

కర్ణాటకలోని 28 లోక్​సభ స్థానాలకు రెండు దశల్లో ఈ నెల 18, 23 తేదీల్లో పోలింగ్​ జరగనుంది.

Last Updated : Apr 16, 2019, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details