తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ నేత హార్దిక్​ పటేల్​పై దుండగుడి దాడి - కాంగ్రెస్​

కాంగ్రెస్​ నాయకుడు హార్దిక్​ పటేల్​పై ఓ వ్యక్తి దాడి చేశాడు. గుజరాత్​ సురేంద్రనగర్​లోని సభలో ప్రసంగిస్తుండగా హార్దిక్​ను చెంప మీద కొట్టాడు. పార్టీ కార్యకర్తలు దుండగుడిని చితకబాదారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు హార్దిక్​.

హార్దిక్​ పటేల్​పై దాడి

By

Published : Apr 19, 2019, 11:53 AM IST

Updated : Apr 19, 2019, 2:01 PM IST

కాంగ్రెస్ నేత హార్దిక్​ పటేల్​పై దాడి

పాటిదార్ల నాయకుడు, కాంగ్రెస్​ నేత హార్దిక్​ పటేల్​పై ఓ గుర్తుతెలియని వ్యక్తి దాడికి దిగాడు. గుజరాత్​ సురేంద్రనగర్ జిల్లా​లోని బల్దానా గ్రామంలో ఓ సభలో హార్దిక్​ ప్రసంగిస్తుండగా చెంప మీద కొట్టాడు. సురేంద్రనగర్​ లోక్​సభ స్థానానికి పోటీ చేస్తోన్న కాంగ్రెస్​ అభ్యర్థి సోమా పటేల్​ దాడి జరిగినప్పడు ఆ వేదికపైనే ఉన్నారు.

ఊహించని సంఘటనతో సభలో గందరగోళం తలెత్తింది. వెంటనే హార్దిక్​ ప్రతిఘటించారు. ఆగ్రహించిన పార్టీ కార్యకర్తలు దుండగుడిని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. హార్దిక్​ పటేల్​ సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Apr 19, 2019, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details