తెలంగాణ

telangana

By

Published : May 21, 2020, 3:38 PM IST

ETV Bharat / bharat

శాంతించిన 'అంపన్‌'- మోదీ, అమిత్​షా సమీక్ష

ఒడిశా, బంగాల్​లో బీభత్సం సృష్టించిన అంపన్​ తుపాను.. క్రమంగా బలహీనపడుతున్నట్లు వెల్లడించింది భారత వాతావరణ విభాగం. ప్రస్తుతం బంగ్లాదేశ్​లో ఉందని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల్లో పరిస్థితులపై ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్​ షా ఆరా తీశారు. నష్టపోయిన వారికి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Amphan Cyclone weakens significantly, currently lays over Bangladesh by IMD
శాంతిస్తోన్న 'అంపన్‌' తుపాను.. మోదీ, అమిత్​షా సమీక్ష

కరోనా వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్​ ప్రచండ తుపాను.. బంగాల్​, ఒడిశాను వణికించిన తర్వాత క్రమంగా బలహీనపడుతున్నట్లు వెల్లడించింది భారత వాతావరణ విభాగం. ప్రస్తుతం బంగ్లాదేశ్​లో ఉన్నట్లు తెలిపింది.

తుపాను తీరం దాటే సమయంలో భీకర గాలులు, కుంభవృష్టి వర్షాలకు చెట్లు కూలిపోయాయి. విద్యుత్త స్తంభాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కోల్​కతా ప్రాంతంపైనా ఈ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. బంగాల్​లోనే సుమారు 12 మంది మరణించారని అంచనా.

గత 100 ఏళ్లలో ఇదే అత్యంత ప్రభావవంతమైన తుఫానని అభిప్రాయపడ్డారు బంగాల్​ అధికారులు. ప్రస్తుతం కోలక్​తా, కొన్ని జిల్లాల్లో దెబ్బతిన్న విద్యుత్తు స్తంభాలను, కమ్యునికేషన్​ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. ఎంత నష్టం వాటిల్లిందో ఇప్పుడే చెప్పలేమని కరోనా కన్నా దీని ప్రభావం చాలా ఎక్కువే ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.

తుపాను దెబ్బకు కోల్​కతా విమానాశ్రయం పరిస్థితి

ఆ రెండు రాష్ట్రాల్లో వర్షాలు..

మేఘాలయ, పశ్చిమ అసోం ప్రాంతాలపై తుఫాను ప్రభావం పాక్షికంగా ఉంటుందని... గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది వాతావరణ విభాగం. 12 గంటలు ఇలాంటి పరిస్థితులు ఉంటాయని... కొన్ని ప్రాంతాల్లో సాధారణ నుంచి తీవ్ర వర్షం పాతం నమోదు కావచ్చని అంచనా వేసింది.

ప్రజలను ఆదుకుంటాం...

తుపాను కారణంగా నష్టపోయివారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. సాధారణ పరిస్థితులు నెలకొని ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం బంగాల్​కు మద్దతుగా ఉందన్నారు.

ఒడిశా, బంగాల్​ సీఎంలతో ఆరా..

ఒడిశా, బంగాల్​లో పరిస్థితులపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యల్లో ఉన్నాయని తెలిపారు. పరిస్థితిపై అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details