ముంబైలోని అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఎదురుగా ఉన్న జియో వరల్డ్ సెంటర్‌లో భాగమైన 'ధీరూభాయ్ అంబానీ స్క్వేర్'ను ఇవాళ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ప్రారంభించారు.దీనిని జాతికి అంకితం చేశారు.2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంబానీ స్క్వేర్ ప్రారంభం - నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న 'ధీరూభాయ్ అంబానీ స్క్వేర్'ను నేడు ప్రారంభించారు. 2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

జియో వరల్డ్ సెంటర్‌లోని ఈ స్క్వేర్, భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేలా సందర్శకుల ఆదరణ పొందుతుందని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. ముంబై నగర వైభవాన్ని చాటిచెబుతుందని ఆకాంక్షించారు. మార్చి 12న మరో రెండు మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయనున్నట్టు నీతా అంబానీ ప్రకటించారు. ముంబై నగర గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని నీతా అంబానీ స్పష్టం చేశారు.
ముంబైలోని అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో వారం రోజుల పాటు సాగే అన్నదాన కార్యక్రమాన్ని అంబానీ దంపతులు ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి 2000 మంది పిల్లలకు భోజనం వడ్డించారు.