దిల్లీలోని యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక, ప్రధాని మోదీ పిలుపునిచ్చిన 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అంశాలపై నేతలు చర్చించారు. అయితే పార్టీ లోక్‌సభా పక్షనేత ఎంపికపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. ప్రధానితో జరిగే సమావేశంలో పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించాలో చర్చించారు.
విందు సమావేశానికి రండి
లోక్‌సభ, రాజ్యసభలో సభ్యులున్న ప్రతిపార్టీ అధినేతను బుధవారం జరిగే సమావేశానికి ఆహ్వానించారు ప్రధాని మోదీ. 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అంశంపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. అలాగే 2022లో నిర్వహించే 75వ స్వాతంత్ర్య దినోత్సవంపై, ఈ ఏడాది చేపట్టే మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల గురించి చర్చిద్దామని తెలిపారు.