తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైసూర్​ పాక్​ కోసం 2 రాష్ట్రాల మధ్య రగడ! - stir over Columnist statement

రసగుల్లా గురించి బంగాల్, ఒడిశా మధ్య పెద్ద వివాదమే నడిచింది. ఇప్పుడు అలాంటిదే మైసూర్​ పాక్​ విషయంలో ప్రారంభమైంది. ఈసారి గొడవ తమిళనాడు, కర్ణాటక మధ్య. ఇంతకీ మైసూర్ పాక్​ ఎవరిది...?

మైసూర్​ పాక్​ కోసం 2 రాష్ట్రాల మధ్య రగడ!

By

Published : Sep 18, 2019, 7:02 AM IST

Updated : Oct 1, 2019, 12:43 AM IST

మైసూర్​ పాక్​ కోసం 2 రాష్ట్రాల మధ్య రగడ!

మైసూర్​ పాక్​... ఈ తీపి వంటకమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. క్షణాల్లో లాగించేస్తారు. అయితే.. ఈ ప్రసిద్ధి చెందిన మిఠాయి​ గుర్తింపుపై వివాదాలు నెలకొన్నాయి.

మైసూర్​ పాక్​ తమిళనాడుకు చెందిందని... ప్రముఖ రచయిత ఆనంద్​ రంగనాథన్ చేసిన వ్యాఖ్యలు కన్నడిగులకు ఆగ్రహం తెప్పించాయి. ​రంగనాథన్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేసినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి.

అయితే.. మైసూర్​లోని ప్రముఖ గురూ స్వీట్​ షాప్​ యజమాని నటరాజ్​ దీనిపై స్పందించారు. మైసూర్​ పాక్​ చరిత్ర, దాని ఆవిర్భావం గురించి ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

''మైసూర్​ పాక్​ తొలుత మైసూర్​లో మాత్రమే ఉండేది. రాజప్రాసాదంలో వంటమనిషిగా ఉన్న మా ముత్తాత.. రాజుగారికోసం అన్ని తీపివంటకాలు వండిపెట్టేవారు. రోజూ ఇవే వంటకాలా.. ఏవైనా కొత్తవి చేయొచ్చుగా అని రాజుగారు అడిగారు. అదే రోజు మా తాత చక్కెరతో పాకం పట్టించి తీపి వంటకం తయారు చేశారు. రాజుకు ఆ మిఠాయి​ ఎంతో నచ్చింది. దాని పేరేంటని అడగ్గా.. 'మీరు ఆదేశించారు నేను చేశాను... నాకు పేరు తెలియదని' మా తాత అన్నారు. అప్పుడా రాజు.. ఇది మైసూర్​లో మాత్రమే తయారైంది కాబట్టి మైసూర్​ పాక్​ అని పిలవడం ప్రారంభించారు. ఈ మైసూర్​ పాక్​కు మైసూర్​తో మాత్రమే సంబంధముంది. ఇతర రాష్ట్రాలతో కాదు.''

- నటరాజ్​, గురూ స్వీట్​ షాప్​ యజమాని.

కాలమిస్ట్​ ఆనంద్​ రంగనాథన్... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో ఉన్న ఫొటో జోడించి ట్విట్టర్​లో పోస్ట్​ చేయడమే ఈ వదంతులకు కారణమైంది. అనంతరం... పెద్ద గందరగోళం తలెత్తింది.

''మైసూర్ పాక్ జీఐ(భౌగోళిక గుర్తింపు) ట్యాగ్‌ను తమిళనాడుకు మంజూరు చేసినందుకు ఏక సభ్య కమిటీ తరఫున ఈ ప్రశంసల టోకెన్‌ను స్వీకరించడం ఆనందంగా ఉంది. దీనిపై ప్రశాంతంగా చర్చలు సాగుతున్నాయి'' అనేది ఆ ట్వీట్​ సారాంశం.

ఆనంద్​ చేసిన ఈ ట్వీట్​.. సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేసింది. తమిళనాడు మైసూర్​పాక్​కు భౌగోళిక గుర్తింపు వచ్చిందన్న వార్తలకు కారణమైంది. ఇదే కర్ణాటక వాసులకు ఆగ్రహం తెప్పించింది.

Last Updated : Oct 1, 2019, 12:43 AM IST

ABOUT THE AUTHOR

...view details