మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి కీలకపదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా 43 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా....అందులో ఆ పార్టీకి 16 పదవులు దక్కనున్నట్లు సమాచారం. శివసేనకు 15, కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు స్పీకర్ పదవి కేటాయించినందున ఆ పార్టీకి పరిమిత సంఖ్యలోనే మంత్రి పదవులు దక్కనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఉద్ధవ్‌తోపాటు మూడు పార్టీల నుంచి మంత్రులుగా ఆరుగురు ప్రమాణం చేశారు. ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థోరట్, నితిన్ రౌత్, శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే, సుభాష్ రాజారాం దేశాయ్ మంత్రులుగా ప్రమాణం చేశారు.