తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బెంగళూరులో నడిరోడ్డుపై వేటకత్తులతో నరికి హత్య

కర్ణాటక రాజధాని బెంగళూరులో నడిరోడ్డుపై పట్టపగలు దారుణ హత్య జరిగింది. మహదేవపురలోని షాపింగ్ మాల్ వద్ద ఓ వ్యక్తిని అడ్డగించిన ముగ్గురు వ్యక్తులు.. వేట కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపారు. ఈ భయానక దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

బెంగళూరులో నడిరోడ్డుపై వేటకత్తులతో నరికి హత్య

By

Published : Oct 26, 2019, 8:09 PM IST

కర్ణాటక బెంగళూరులో దారుణ హత్య జరిగింది. మహదేవపురలోని ఓ షాపింగ్ మాల్​ సమీపంలో ముగ్గురు దుండగులు కదాబిసినహళ్లికి చెందిన రౌడీషీటర్​ మంజునాథ్​ను వేటకత్తులతో నరికి చంపారు.

స్నేహితురాలితో మహదేవపుర మీదగా వెళుతున్నాడు మంజునాథ్. అతడిని వెంబడిస్తూ ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. ఓ సిగ్నల్​ వద్ద ఆగగానే మంజునాథ్​పై దాడి చేశారు. మంజునాథ్​ తప్పించుకుని పారిపోగా వెంటాడి షాపింగ్​ మాల్ సమీపంలో పట్టుకున్నారు. అక్కడే వేట కత్తులతో విచక్షణా రహితంగా తలపై నరికారు.

బెంగళూరులో నడిరోడ్డుపై వేటకత్తులతో నరికి హత్య

తల ఛిద్రమయ్యేలా..

గుర్తుపట్టడానికి వీలులేకుండా మంజునాథ్​ ముఖం పూర్తిగా ఛిద్రమయింది. అతడు మరణించాడని నిర్ధరించుకున్న దుండగులు వారు వచ్చిన స్కూటీపైనే అక్కడి నుంచి పారిపోయారు.

ఈ భయానక దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వీటి ఆధారంగానే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు.

మంజునాథ్​ ఇంతకుముందు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details