తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోసంరక్షణను ప్రబోధిస్తూ 11 వేల కి.మీ పాదయాత్ర

2017లో కశ్మీర్​లో మొదలు పెట్టిన ఫైజ్​ ఖాన్​ పాదయాత్రకు ఏడాది దాటింది. ప్రజా సేవకు వినూత్న మార్గం ఎన్నుకున్న ఆయనకు విశేష స్పందన లభిస్తోంది. 11 వేల కి.మీ నడిచి, రాజస్థాన్​లోని  సింఘానాకు చేరుకున్న ఆయనకు  ప్రజలు ఘన స్వాగతం పలికారు.

గోసంరక్షణను ప్రబోధిస్తూ 11 వేల కి.మీ పాదయాత్ర

By

Published : Jul 21, 2019, 6:04 AM IST

గోసంరక్షణను ప్రబోధిస్తూ 11 వేల కి.మీ పాదయాత్ర

గోసంరక్షణను ప్రబోధిస్తు ఫైజ్​ఖాన్​ చేపట్టిన పాద యాత్ర రాజస్థాన్​లోని సింఘానా చేరుకుంది. గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

జమ్మూ-కశ్మీర్​లోని లద్ధాఖ్​కు చెందిన మహమ్మద్​ ఫైజ్​ ఖాన్​.. . ప్రజాసేవలో భాగంగా గోవధను వ్యతిరేకిస్తూ, గోమాత గొప్పదనాన్ని చాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకు కశ్మీర్​ నుంచి కన్యాకుమారి దాకా, కన్యాకుమారి నుంచి అమృత్​సర్​ దాకా 14 వేల కి.మీ పాదయాత్ర చేయాలని సంకల్పించాడు. 2017 లో జూన్​ 24న యాత్ర ప్రారంభించి 11వేల కి.మీ నడిచి రాజస్థాన్​లోని సింఘానాకు చేరుకున్నారు.

ఖాన్​ సంకల్పానికి ప్రతిగ్రామంలోనూ​ ఘన స్వాగతం లభిస్తోంది. పూలమాలలు, విజయ సింధూరాలతో మహిళలు స్వాగతిస్తున్నారు. పేరుకు ముసల్మాన్​ అయినా.. గ్రామాల్లో ప్రముఖ దేవాలయాలను సందర్శించి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. దేశంలో మతాల కాదు మానవత్వం వర్ధిల్లాలని చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

గోరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణతో పాటు పలు సామాజిక అంశాలపై పోరాడుతున్నారు ఖాన్​​. మరో 2500 కిలోమీటర్లతో తన పాదయాత్ర పూర్తవుతుందని చెప్పుకొచ్చారు.

" 14 వేల కి.మీల గోసేవా సద్భావన పాదయాత్రలో ఇప్పటివరకు దాదాపు 11వేల కి.మీ పూర్తయింది. గోసేవా, గోరక్ష, వృక్షాలను కాపాడండి, నదులను కాపాడి పర్యావరణాన్ని రక్షించండి. దేశంలో ప్రేమా, మమకారాలను పెంచండి. ఈ రోజుల్లో కేన్సర్​కు ప్రధాన కారణం రసాయనిక ఎరువులు. అందుకే ఆవు పేడను పొలాల్లో ఎరువులా వాడాలి. వేదాలలో ఆవులను విశ్వానికి గోమాతగా పేర్కొన్నారు. హజ్రత్​ సల్​ ఉల్లాహ్​ ప్రవక్త గోపాలు అమృతం అన్నారు. అందుకే ఆవులను కాపాడుతూ భూమిని కాపాడాలి."

-మహమ్మద్​ ఫైజ్​ఖాన్​, పాదయాత్రికుడు

ఇదీ చూడండి: మీసం కత్తిరించారని సెలూన్​పై కేసు!

ABOUT THE AUTHOR

...view details