Ayodhya Ram Mandir Open Time :ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య భవ్య రామ మందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్టాపనకు ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ.. రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనున్నారు. మృగశిర నక్షత్రంలో అభిజిత్ ముహుర్తంలో ఈ మహత్తర కార్యక్రమం చేపట్టనున్నారు.
నాలుగు దశలుగా వేడుకలు
Ayodhya Ram Mandir Opening Date : రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు సంఘ్ పరివార్ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో సాకేత్ నిలయంలో సంఘ్ పరివార్ సమావేశం నిర్వహించి.. ప్రాణ ప్రతిష్ఠ ముహుర్తాన్ని ఖరారు చేసింది. రామ్‌లల్లా ప్రతిష్ఠాపన వేడుకలను నాలుగు దశలుగా విభజించింది. దీంతోపాటు అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించింది.
Ayodhya Ram Mandir Photo : తొలి దశలో మొత్తం కార్యాచరణను సిద్ధం చేస్తారు. అందుకు పలు స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. కార్యక్రమ నిర్వహణకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రాముడి చిత్రపటం, కరపత్రం అందించనున్నారు. ప్రాణప్రతిష్ఠ రోజు.. దీపోత్సవం జరుపుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ దశ.. 2024 జనవరి 1న ప్రారంభం కానుంది. మూడో దశలో జనవరి 22వ తేదీన దేశంలో అనేక ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో జనవరి 26వ తేదీ నుంచి భక్తులకు అయోధ్య రాముడి దర్శనం కల్పించనున్నారు.