తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనవరిలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ!.. హోటళ్లు, రిసార్ట్​లు హౌస్​ఫుల్​..

Ayodhya Ram Mandir Inauguration : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర నిర్మాణం చకచకా సాగుతున్న వేళ.. ఆ ప్రదేశం పర్యాటక శోభ సంతరించుకునేందుకు ముస్తాబవుతోంది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు మరో 6 నెలల సమయం ఉండగానే.. అక్కడి హోటళ్లు, రిసార్టులకు అడ్వాన్సు బుకింగ్‌లు పోటెత్తుతున్నాయి. అపూర్వ ఘట్టమైన విగ్రహ ప్రతిష్ఠాపనను కళ్లారా చూసేందుకు భక్తులు ఆన్‌లైన్‌, ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా గదులు బుక్‌ చేసుకుంటున్నారు.

ram-lalla-idol-to-be-installed-in-january-2024-advance-booking-rush-in-ayodhya
అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన

By

Published : Jul 20, 2023, 10:42 PM IST

Updated : Jul 21, 2023, 6:18 AM IST

Ayodhya Ram Mandir Inauguration : అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 15-24 మధ్య జరిగే రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనను తిలకించేందుకు భక్తులు సమాయత్తం అవుతున్నారు. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు తహతహలాడుతున్న భక్తులు.. ఇప్పుడే పెద్దఎత్తున హోటళ్లు, రిసార్ట్‌లు, హోమ్‌స్టేలు బుక్‌ చేసుకుంటున్నారు. లక్షల్లో ప్రజలు తరలివచ్చే అవకాశాలున్నాయని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. ట్రావెల్‌ ఏజెన్సీల ద్వారా తమను సంప్రదించే వారు 10, 12 రోజులు ఉండేలా గదులు బుక్‌ చేసుకుంటున్నారని తెలిపారు. దిల్లీ, మహారాష్ట్ర, ఇతర మెట్రో నగరాల నుంచి ఎక్కువగా సంప్రదిస్తున్నారని వివరించారు. ముంబయికి చెందిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ.. వారం పాటు 15వేల గదులు కావాలని అడిగినట్లు ఓ రిసార్ట్‌ ప్రకటించింది.

Ayodhya Ram Mandir : రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనను దృష్టిలో పెట్టుకుని అక్కడి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించి.. భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించేలా సిద్ధమవ్వాలని మార్గదర్శకం చేస్తున్నారు. పేయింగ్ గెస్ట్ పథకం కింద 41 మంది భవన యజమానులకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. పర్యాటకులు, భక్తుల బస కోసం హోటల్, గెస్ట్ హౌస్, హోమ్‌స్టేలు అవసరమని, ఇవి స్థానికులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని అధికారులు చెబుతున్నారు.

శరవేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు..
Ayodhya Ram Mandir Construction Status : ఉత్తర్​ప్రదేశ్​ అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. షెడ్యూల్​ ప్రకారం మొదటి అంతస్తు పనులు జరుగుతున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​ అధికారిక ట్విట్టర్​ ద్వారా గురువారం తెలిపింది. ఆ పోస్ట్​లో కొన్ని ఫొటోలనువిడుదల చేసింది. అందులో మొదటి అంతస్తు కోసం పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. 2024 సంక్రాంతి పర్వదినం సందర్భంగా (జనవరి 14 నుంచి జనవరి 24) వరకు అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయని ఇటీవల ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర వెల్లడించారు. ఆ పది రోజుల పాటు వైభవంగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అయోధ్య రామాలయంలోకి వచ్చే ఏడాది సంక్రాంతికే భక్తులను అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వీలు కల్పించేలా సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న భూమిపూజ చేశారు.

Last Updated : Jul 21, 2023, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details