sitara

ETV Bharat / tv-and-theater

కేబుల్ బిల్లు ఆదా ఇలా...

కేబుల్​ ఆపరేటర్​ అయితే నెలకు ఓ రూ.200 చెల్లించేవాళ్లం. డీటీహెచ్​ అయితే రూ.200-300 రీఛార్జ్​ చేసేవాళ్లం. ఇప్పుడు ట్రాయ్​ కొత్త నిబంధనతో లెక్కమారింది. నచ్చిన ఛానల్​కు మాత్రమే చెల్లించే అవకాశం వచ్చింది. ఇది లాభదాయకమే. కానీ... ఛానళ్ల జాబితా కాస్త అటూఇటూ అయితే మాత్రం నష్టమే. ఈ సమస్యకు యాప్​ రూపంలో ఓ పరిష్కారం చూపింది ట్రాయ్.

టీవీ

By

Published : Feb 20, 2019, 10:48 AM IST

"మీకు నచ్చిన ఛానళ్లను ఎంపిక చేసుకుని చూడండి.. అవసరమైనంత మాత్రమే చెల్లించండి" అంటూ ట్రాయ్ కొద్ది రోజులుగా చెబుతోంది. కొందరు దీనిని సమర్థిస్తుంటే మరికొందరు ప్రయోజనం లేదని పెదవి విరుస్తున్నారు. కేబుల్ ఆపరేటర్లు అవసరం లేని ఛానళ్లకు సబ్​స్క్రైబ్​ చేయించి ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారన్నది వారి ప్రధాన ఆరోపణ. ఈ దోపిడీని అరికట్టడానికి మీరు ఎంపిక చేసుకున్న ఛానళ్లకు మాత్రమే చెల్లించండని ట్రాయ్ అంటోంది.

కొత్త నిబంధన ప్రకారం తక్కువ ఖర్చులోనే కావాల్సిన ఛానళ్లను ఎంపిక చేసుకునేందుకు ఓ కొత్త యాప్​ తీసుకువచ్చింది.

ఛానల్ సెలక్టర్ యాప్​..

ట్రాయ్ ఆప్

ట్రాయ్ ఆప్ కొత్తగా ప్రవేశపెట్టిన ఛానల్ ప్యాక్స్​ని ఎంచుకోవడానికి ట్రాయ్ 'ఛానల్ సెలక్టర్ యాప్​​' తీసుకువచ్చింది. సంస్థ అధికారిక వెబ్​సైట్ నుంచి దీనిని పొందవచ్చు. ఛానల్ సెలక్టర్ యాప్​లో 'గెట్ స్టార్టెడ్' పై క్లిక్ చేయాలి. అనంతరం మీ వివరాలు నమోదు చేయాలి. అన్ని వివరాలు ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితేనే ఇవ్వండి. ప్రాంతాన్ని మాత్రం తప్పకుండా నమోదు చేయండి. ఎందుకంటే మీ ప్రాంతాన్ని బట్టి రీజనల్ ఛానళ్లను తెలుసుకోవచ్చు.

ఆ తర్వాత వివిధ విభాగాల్లో ఏది కావాలో... అంటే వార్తలు, సంగీతం, భక్తి, క్రీడలను ఎంపిక చేసుకోవాలి. హెచ్​డీ, ఎస్​డీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంతే అవసరైన ఛానల్ లిస్ట్ తయారవుతుంది.

ఏ ఛానళ్లు ఎన్ని..

ట్రాయ్ ఆప్

అనంతరం 'ఫ్రీ టు ఎయిర్ ఛానల్' ట్యాబ్​పై క్లిక్ చేయాలి. పైన ఉన్న 'ఛానల్ సెలక్టెడ్' ఏరియాలో మీ ఛానళ్ల వివరాలను తెలుసుకోవచ్చు. అక్కడే మీ ఛానళ్లకు ఎంత చెల్లించాలో తెలుస్తుంది. ఫ్రీ ఛానళ్ల సంఖ్య 550. వాటిలో మీకు కావల్సినవి ఎంచుకున్న తర్వాత పే ఛానళ్లను సెలక్ట్ చేసుకోవాలి. ఈ సెక్షన్​లో ఛానళ్ల వివరాలను ప్రాంతం, నాణ్యత, అంశం, ధర ఆధారంగా వరుసలో చూడొచ్చు.

ప్యాక్స్

చివరగా 'ఛానల్ బొకే' లిస్టుకు వెళ్లి అక్కడ మీకు తగిన ప్యాక్​ను ఎంచుకోండి. మీ ఛానళ్లన్నీ 'మై సెలక్షన్'లో ఉంటాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి.... అందులో ఎఫ్​టీపీ, పే ఛానళ్లు ఎన్నో తెలుసుకోవచ్చు. కనీసం 25 ఛానళ్లను ఎంపిక చేసుకోవాలి. అనంతరం 'ఆప్టిమైజ్' బటన్​పై క్లిక్ చేస్తే రిపీట్ అయిన ఛానళ్లను తీసేసి.. మీకు సరసమైన ధరలలో లభించే ఛానళ్లను అందిస్తుంది.

ఉదాహరణకు మీరు ఏదో ఒక ఛానల్​ను ఎంపిక చేసుకున్నారు..అదే ఛానల్ మీరు ఎంపిక చేసుకున్న ప్యాక్​లో కూడా ఉంటే అందులో ఏది తక్కువ ధరకు వస్తుందో అదే ఉంటుంది. నెలవారీ బిల్లు ఎక్కువ కాకుండా ఇది సాయపడుతుంది.

ఛానళ్లను ఎంపిక చేసుకుని ఆప్టిమైజ్ చేసిన తర్వాత ఆ వివరాలను మీ ల్యాప్​టాప్ లేదా కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోవాలి. డీటీహెచ్, కేబుల్ ఆపరేటర్ వెబ్​సైట్​లోకి వెళ్లి ఈ ఛానళ్లను కాపీ చేయాలి. అంతే మీరు కోరుకున్న ఛానళ్లు మీ టీవీలో ప్రసారం అవుతాయి.

ABOUT THE AUTHOR

...view details