sitara

ETV Bharat / tv-and-theater

పాక్​లో నో 'ధమాల్' - dhamal

''పుల్వామాలో జరిగిన ఘటన చాలా దారుణం. తీవ్రంగా ఖండిస్తున్నాను, మాటల్లో వ్యక్తపరచలేనంత కోపం వస్తుంది'' అని అజయ్ ట్వీటాడు.

అజయ్ దేవ్​గణ్

By

Published : Feb 18, 2019, 3:26 PM IST

Updated : Feb 19, 2019, 11:36 AM IST

అజయ్ దేవ్​గణ్ తన తాజా చిత్రం 'టోటల్ ధమాల్'ని పాకిస్థాన్​లో విడుదల చేయట్లేదని ప్రకటించారు. పుల్వామా దాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజయ్ తెలిపారు.

"ప్రస్తుత పరిస్థితుల్లో టోటల్ ధమాల్ చిత్రాన్ని పాకిస్థాన్​లో విడుదల చేయాలనుకోవట్లేదు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఘటన చాలా దారుణం. తీవ్రంగా ఖండిస్తున్నాను. మాటల్లో వ్యక్తపరచలేనంత కోపం వస్తుంది"
- అజయ్​ దేవ్​గణ్​ ట్వీట్​

ఇంద్రకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్, మాధురి దీక్షిత్, అర్షద్ వార్సీ, అనిల్ కపూర్, జావేద్ జాఫ్రీ, రితేశ్ దేశముఖ్ తదితరులు నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, అజయ్ దేవగణ్​ ఎఫ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో సినిమా తెరకెక్కుతుంది. ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.

పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Feb 19, 2019, 11:36 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details