పాక్లో భారతీయ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. అందులోనూ బాలీవుడ్ సినిమాలకు అక్కడ ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాక్లో సినిమాలు విడుదల చేయట్లేదని పలు హిందీ సినిమాల నిర్మాతలు ప్రకటించారు. పొరుగు దేశంలో భారతీయ చిత్రాలు విడుదల కానంత మాత్రాన చిత్ర పరిశ్రమపై అంత ప్రభావమేమీ ఉండదని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అభిప్రాయపడ్డారు.
"పాకిస్థాన్లో దాదాపు 150 స్క్రీన్లు ఉన్నాయి. మన లాగే వాళ్లూ హిందీ చిత్రాలంటే ఎక్కువ ఇష్టపడతారు. హాలీవుడ్ చిత్రాలు ఏడాదిలో కొన్ని మాత్రమే వస్తాయి. అందుకే భారతీయ సినిమాలవైపే మక్కువ చూపుతారు. పాక్ మార్కెట్ చాలా చిన్నది. దీనివల్ల వారే ఎక్కువ నష్టపోతారు" -తరణ్ ఆదర్శ్, సినీ విశ్లేషకుడు