sitara

ETV Bharat / tv-and-theater

అట్టహాసంగా ఆస్కార్

అకాడెమీ అవార్డుల వేడుక లాస్​ఏంజెల్స్​లో వైభవంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా 'గ్రీన్ బుక్'​ ఆస్కార్​ని అందుకోగా, ఉత్తమ నటుడిగా రామీ మాలిక్ నిలిచారు.

ఆస్కార్ విజేతలు

By

Published : Feb 25, 2019, 11:46 AM IST

Updated : Feb 25, 2019, 1:10 PM IST

ఆస్కార్ వేదిక

ఆస్కార్... ప్రపంచంలో ప్రతి నటుడి కల. 2018లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలకు అకాడమీ అవార్డులు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తమచిత్రంగా 'గ్రీన్ బుక్​' ఆస్కార్​ని అందుకోగా, ఉత్తమ నటుడిగా రామీ మాలిక్ నిలిచారు. ఉత్తమ దర్శకుడిగా రోమా చిత్రాన్ని తెరకెక్కించిన ఆల్ఫానో కురానో ఆస్కార్ అందుకున్నాడు. ఉత్తమ నటిగా 'ది ఫేవరేట్' చిత్ర నటి ఒలివియన్ కోల్​మాన్ నిలిచింది.

ఆస్కార్ విజేతలు వీరే...

విభాగం విజేత చిత్రం
ఉత్తమ చిత్రం జిమ్ బుర్కె, చార్లెస్.బి గ్రీన్​బుక్
ఉత్తమ దర్శకుడు ఆల్ఫానో కురానో రోమా
ఉత్తమ నటుడు రామీ మాలిక్ బొహిమియన్ రాప్సోడీ
ఉత్తమ నటి ఒలివియన్ కోల్​మాన్ ది ఫేవరేట్
ఉత్తమ సహాయ నటుడు మహర్షలా అలీ గ్రీన్​బుక్
ఉత్తమ సహాయ నటి రెజినా కింగ్ ఇఫ్ బేల్ స్ట్రీట్ కుడ్ టాక్
ఉత్తమ విదేశీ భాష చిత్రం ఆల్ఫానో కురానో రోమా
ఉత్తమ యానిమేటడ్ ఫిల్మ్ బాబ్ పెరిషెట్టి స్పైడర్​మెన్ ఇన్​టూ ది స్పైడర్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ గై నేట్టివ్,జేమీ రే న్యూమేన్ స్కిన్
ఉత్తమ యామిమేటడ్ షార్ట్ ఫిల్మ్ డోమి షీ బావో
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ జాన్ ఒట్టోమాన్ బోహిమియన్ రాప్సోడీ
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే నిక్ వాల్లేలొంగా, బ్రియన్ క్యూరీ, పీటర్ ఫారెల్లీ గ్రీన్​బుక్
ఉత్తమ ఎడాప్టడ్ స్క్రీన్​ప్లే చార్లీ వాచ్టెల్, డేవిడ్ రాబినోవిట్జ్, స్పైక్​ లీ బ్లాక్ క్లాన్స్​మ్యాన్
ఉత్తమ సంగీతం లూడ్విగ్ గోరాన్సాన్ బ్లాక్ ప్యాంథర్
ఉత్తమ గేయం షాలో(లేడీ గాగా, మార్ రోన్సాన్, ఆండ్రూ వ్యాట్) ఏ స్టార్ ఈజ్ బోర్న్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ పాల్​ లంబార్ట్,ఇయాన్ హంటర్. ఫస్ట్ మ్యాన్
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ జాన్ వార్​హస్ట్,నినా హార్ట్​స్టోన్ బొహిమియన్ రాప్సోడీ
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ పాల్ మేస్సీ, టిమ్ కావజిన్, జాన్ కాసాలీ బొహిమియన్ రాప్సోడీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ ఆల్ఫాన్సో కురానో రోమా
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ హానా బేచ్లర్ బ్లాక్ ప్యాంథర్
ఉత్తమ డాక్యుమెంటరీ ఎలిజబేత్ చాయ్, జిమ్మిచిన్ ఇవాన్ హేస్, షానాన్ డిల్ ఫ్రీ సోలో
ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ మెలిస్సా బెర్టాన్, రేకా పీరియడ్ ఎండ్​ ఆఫ్ సెంటెన్స్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ రూత్ కార్టర్ బ్లాక్ ప్యాంథర్
ఉత్తమ మేకప్, హేయిర్​స్టైలింగ్ గ్రెగ్ కాన్మోమ్, కేట్ బిస్కో, పెట్రిషియా దెహ్నాయ్ వైస్


ఈ ఏడాది ఆస్కార్​లో ఎక్కువ అవార్డులు పొందిన చిత్రంగా బొహిమియన్ రాప్సోడీ(4) రికార్డు సృష్టించింది. రోమా, బ్లాక్ ప్యాంథర్, గ్రీన్​బుక్ చిత్రాలు మూడు పురస్కారాలు దక్కించుకున్నాయి. రోమా చిత్ర దర్శకుడు ఆల్ఫాన్సో కురానో ఉత్తమ దర్శకుడితో పాటు మొత్తం మూడు అవార్డులు అందుకున్నారు.















Last Updated : Feb 25, 2019, 1:10 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details