sitara

ETV Bharat / tv-and-theater

ఆస్కార్ ఏర్పాట్లు అదరహో - acdemy

"ఏ స్టార్ ఈజ్ బోర్న్" చిత్రంలోని "షాలో" పాటతో బ్రాడ్లీ కూపర్ వేదికపై అదరగొట్టనున్నాడు. "ది ప్లేస్ వేర్ లాస్ట్ థింగ్స్ గో" గేయంతో మిడ్లర్ స్టేజీపై రాక్ చేయనున్నారు.

ఆస్కార్ ఏర్పాట్లు

By

Published : Feb 21, 2019, 8:09 PM IST

ఆస్కార్ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని లాస్​ఎంజెల్స్​లో ఈ నెల 24 వ తేదీన 91వ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. డాల్బీ థియేటర్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రెడ్ కార్పెట్లు, మిరుమిట్లు గొలిపే దీపాలంకరణతో వేదిక పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఆస్కార్ ఏర్పాట్లు

ప్రతి సంవత్సరం అకాడమీ వేదికపై హాలీవుడ్ ప్రముఖుల చిత్రాలు మాత్రమే ప్రదర్శించేవారు. ఈసారి ఇతర రంగాలకు చెందిన సెరెనా విలియమ్స్, చెఫ్ జోస్ ఆండ్రెస్ లాంటి వ్యక్తుల ఫొటోలు ఉంచారు.

వ్యాఖ్యాత లేకుండా ప్రదానోత్సవం నిర్వహించడం ఈసారి ప్రత్యేకత. అయితే... యాంకర్​ లేని లోటు తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచించారు నిర్వాహకులు.

"ప్రారంభ వేడుక ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. షో ఆద్యంతం వినోదభరితంగా సాగుతుంది. ఈ ఘట్టం మీరు ఎప్పటికీ మర్చిపోని విధంగా ఉంటుంది. చాలా రోజుల గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. టీవీల్లో చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు". --గ్లేన్ వీస్, నిర్వాహకులు

"ఏ స్టార్ ఈజ్ బోర్న్" చిత్రంలోని "షాలో" పాటతో బ్రాడ్లీ కూపర్ వేదికపై అదరగొట్టనున్నాడు. "ది ప్లేస్ వేర్ లాస్ట్ థింగ్స్ గో" గేయంతో మిడ్లర్ స్టేజ్ రాక్ చేయనున్నారు.

"ఉత్తమ చిత్రం ప్రకటించే సమయానికి చాలా మంది నిద్రలోకి జారుకుంటారు. అందుకే విజేతలను ప్రకటించి, అవార్డు అందజేసే సమయం 90 సెకన్లు మాత్రమే ఉంచాలని నిర్ణయించాం. ఈ 90 సెకన్లు నిబంధనను పాటించాల్సిందిగా నామినీస్​ని కోరాం" --డోనా గిగ్లెట్, నిర్వాహకులు

సమయపాలన కోసం వాణిజ్య ప్రకటనలు వచ్చే సమయంలో కొన్ని విభాగాల అవార్డులు ప్రకటించాలని నిర్వాహకులు అనుకున్నారు. ప్రముఖులు వ్యతిరేకించగా... తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటలకు ఆస్కార్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అమెరికాలో ఆదివారం రాత్రి జరగనున్నాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details