ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డును రామీ మాలిక్ అందుకున్నాడు. 'బొహిమియన్ రాప్సోడీ' చిత్రంలో నటనకు గాను అకాడమీ అవార్డుని గెల్చుకున్నాడు. ఇప్పటికే ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అందుకున్న రామీ మాలిక్ ఆస్కార్నీ సొంతం చేసుకున్నాడు. నామినేటైన తొలిసారే ఈ పురస్కారాన్ని దక్కించుకున్నాడు.
'గాయకుడే' నాయకుడు - malek
ఆస్కార్ 2019 ఉత్తమ నటుడు అవార్డుని రామీ మాలిక్ సొంతం చేసుకున్నాడు. తొలిసారి ఈ అవార్డుని దక్కించుకున్నాడు.
రామీ మాలెక్
బ్రిటీష్ రాక్ బ్యాండ్ క్వీన్‌లో లీడ్ సింగరైన ఫ్రెడ్రిక్ మెర్క్యూరీ జీవితం ఆధారంగా తెరకెక్కింది బొహిమియన్ రాప్సోడీ. ఈ చిత్రంలో రామీ మాలిక్ తన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు.
గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఏడో స్థానంలో ఉన్న ఈ సినిమా పలు అంతర్జాతీయ పురస్కారాలు గెల్చుకుంది. 800 మిలియన్ డాలర్ల(4800 కోట్లు) పైచిలుకు కలెక్షన్లు సాధించిన ఈ సినిమా... ఆస్కార్ ప్రతి విభాగాంలోనూ పోటీకి నిలిచింది.
Last Updated : Feb 25, 2019, 10:36 AM IST