శ్రీదేవి నటించిన ఆఖరి చిత్రం మామ్. 2017లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం చైనాలో విడుదల కానుంది. మార్చి 22న మామ్ చిత్రం డ్రాగన్ ప్రేక్షకుల ముందుకు వెళ్లనున్నట్లు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్లో పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన చైనా పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది.
చైనాలో శ్రీదేవి 'మామ్'
కూతురుపై జరిగిన అఘాయిత్యానికి తల్లి పడే ఆవేదన కోపంగా మారితే ఎలా ఉంటుందో మామ్ చిత్రంలో కళ్లకు కట్టారు దర్శకుడు రవి ఉదయవార్
శ్రీదేవి
కూతురుపై జరిగిన అఘాత్యానికి తల్లి పడే ఆవేదన కోపంగా మారితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టారు దర్శకులు. బాలీవుడ్లో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా శ్రీదేవికి జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చింది.