సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న మహర్షి చిత్రం విడుదల తేదీ ఖరారైంది. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్లో పంచుకున్నాడు.
వేసవిలో వస్తున్న మహర్షి - release
మహర్షి చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. పూజా హెగ్డే, సోనల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
![వేసవిలో వస్తున్న మహర్షి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2563100-979-8a329f40-b081-416f-b24d-350a2a4750ff.jpg)
మహర్షి
మహర్షిలో పూజా హెగ్డే, సోనల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లరినరేశ్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినిదత్, ప్రసాద్ వి. పోట్లూరి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాత్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా మహేశ్ బాబు నటిస్తున్న 25వ చిత్రం. గతంలో మహేశ్ నటించిన పోకిరి, భరత్ అనే నేను చిత్రాలూ ఏప్రిల్‌లోనే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈ చిత్రం విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాడు ప్రిన్స్.