తల్లి కాబోతున్న యాంకర్ లాస్య - యాంకర్ లాస్య
బుల్లితెర మీద తన చిలిపి మాటలతో అల్లరి చేసి ఎప్పుడూ నవ్వించే యాంకర్ లాస్య...తాను తల్లి కాబోతున్నాననే వార్తను పంచుకుంది. తనకు పుట్టబోయే బిడ్డ గురించి చిన్నపాటి వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

తల్లి కాబోతున్న తెలుగు యాంకర్
ఈ ప్రత్యేకమైన రోజున ఒక శుభవార్తను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా ప్రతిరూపం రాబోతుంది. త్వరలోనే మేము ముగ్గురం కాబోతున్నాం. ప్రస్తుతం 8వ నెల నడుస్తోంది. బాబు లేదంటే పాప ఎవరు పుడతారో తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. - లాస్య, బుల్లితెర యాంకర్