అమితాబ్ హాఫ్ సెంచరీ - abuishek
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. సినీ కెరీర్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
చిత్ర పరిశ్రమలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కవితాత్మక పోస్టును అభిషేక్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తండ్రి చిత్రం ముద్రించిన టీషర్ట్ వేసుకొని ఫొటోకు పోజిచ్చాడు.
"ఐకాన్! ఆయన నాకు నాన్న మాత్రమే కాదు. ఆప్త మిత్రుడు, గురువు, విమర్శకుడు, నా అండ. ఆయన సినీ ప్రయాణం మొదలు పెట్టి నేటికి 50 ఏళ్లు. ఇప్పటికీ అదే ఇష్టంతో, ప్రేమతో వృత్తిని కొనసాగిస్తున్నారు. ప్రతిరోజును సినీ పరిశ్రమలో తన మొదటి రోజులానే భావించి పని చేస్తారు" అని అభిషేక్ పోస్ట్ చేశాడు.
మరో 50 ఏళ్లకు సరిపడా జ్ఞానాన్ని బిగ్‌బీ మనకు అందించారని అభిషేక్ ప్రశంసించాడు.
హీరోగానే కాకుండా సహాయ పాత్రల్లోనూ, విభిన్న పాత్రల్లోనూ తనదైన నటనతో అదరగొడుతూ ముందుకెళ్తున్నారు అమితాబ్ బచ్చన్. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు.