నందితా రాజ్ ప్రధానపాత్ర వహించిన చిత్రం 'విశ్వామిత్ర'. గీతాంజలి, త్రిపుర చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ కిరణ్ ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది.
సస్పెన్స్, హర్రర్ నేపథ్యంలో చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. "అతను సీసీ కెమెరాలో ఎందుకు రికార్డు కాలేదో అర్థం కావడం లేదు", "ఈ విశ్వంలో మానవుని మేధస్సుకు అందని విషయాలు ఎన్నో ఉన్నాయి" అనే డైలాగ్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రసన్న, సత్యం రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని మార్చి 21న విడుదల చేయనున్నారు.