పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడితే... ఇమ్రాన్ ఖాన్ మాత్రం తమను నిందించడం సరికాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ తమపై ఆరోపణలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందించినవర్మ ఘాటుగా స్పందించాడు.
‘ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్... చర్చలతోనే సమస్యలు పరిష్కారమైతే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా? ఓ వ్యక్తి ఆర్డీఎక్స్ పట్టుకుని మావైపు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతనితో చర్చలు ఎలా జరపాలో మీరే భారతీయులకు నేర్పించండి సర్. అందుకు ట్యూషన్ ఫీజూ చెల్లిస్తాం. ఒకప్పుడు బిన్‌లాడెన్ మీ దగ్గరే ఉన్నట్లు అమెరికా నిరూపించింది. అతను అక్కడే ఉన్నట్లు వాళ్లకు తెలిసింది మీకెందుకు తెలీదు? కనీసం మీ దేశంలో ఎవరు ఉంటున్నారో మీకు తెలియకపోతే అదీ ఓ దేశమేనా? అంటూ ఆగ్రహం వక్తం చేశాడు రామ్‌గోపాల్ వర్మ.
జైషే మహమ్మద్, లష్కరే, తాలిబన్, ఆల్‌ఖైదా సంస్థలు మీవి కాదని, వాటికి వ్యతిరేకమని మీరెప్పుడైనా చెప్పారా అంటూ పాక్ ప్రభుత్వానికి చురకలంటించాడు. మీకు బాంబులేమైనా క్రికెట్ బంతుల్లా కనిపిస్తున్నాయా అంటూ వర్మ ప్రశ్నించాడు.