కోడి రామకృష్ణకు అస్వస్థత - దర్శకుడు
సీనియర్ దర్శకుడు కోడిరామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు.
కోడి రామకృష్ణ, సినీ దర్శకుడు
టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన అతికొద్ది మంది దర్శకులలో కోడిరామకృష్ణ ప్రముఖులు. తెలుగు సహా తమిళ, మలయాళ, హిందీ భాషలలోనూ సినిమాలు తెరకెక్కించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగ రాహువు’ ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా.
- 1982లో చిరంజీవి హీరోగా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడయ్యారు. మొదటి సినిమాతోనే గోల్డెన్ జూబ్లీ హిట్ అందుకున్నారు. ‘మంగమ్మ గారి మనవడు’, ‘తలంబ్రాలు’, ‘అంకుశం’ వంటి ఆల్ టైమ్ హిట్స్ నిర్మించారు. మరోవైపు భక్తి చిత్రాల్లో ‘అమ్మోరు’, ‘దేవి’, ‘దేవుళ్లు’, హార్రర్ చిత్రాలల్లో ‘అరుంధతి’ టాలీవుడ్‌లో పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. ఆయన దర్శకుడిగానే కాకుండా నటుడిగా పలు సినిమాల్లో ముఖ్యపాత్రల్లో అభిమానులను ఆకట్టుకున్నారు.