ప్రఖ్యాత రంగస్థల, సినీ నటుడు డి.ఎస్.దీక్షితులు సోమవారం సాయంత్రం కన్నుమూశారు. తెలుగు సినిమాల్లో పూజారి పాత్రలతో మంచి పేరు సంపాదించారాయన.
జూలై 28, 1956న హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, రేపల్లెలో జన్మించారు. హైదరాబాద్లో నాటకాల్లో నటిస్తూ వాటికి దర్శకత్వం వహించేవారు. మొదటగా నటించిన ఆగమనం సీరియల్కు నంది అవార్డు సొంతం చేసుకున్నారు.
నటుడు దీక్షితులు కన్నుమూత - DEEKSHITHULU
టాలీవుడ్ నటుడు డి.ఎస్. దీక్షితులు సోమవారం సాయంత్రం మరణించారు.
డి.ఎస్.దీక్షితులు
తర్వాత హిట్ అయిన మురారి, ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు సినిమాల్లో తనదైన నటన ప్రదర్శించారు. దీక్షితులు మరణంపై తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.