టికెట్ లేకుంటే మీ టైంవస్తుంది.! - అప్నా టైమ్ ఆయేగా
తేరా టైమ్ ఆయేగా... బినా టికెట్ ఆయా హై తో పకడా జరూర్ జాయేగా(టిక్కెట్ లేకుండా వస్తే పట్టుబడకుండా వెళ్లలేరు..) అనే పంక్తులు నెటిజన్లను విపరీతంగా అలరిస్తున్నాయి.
అప్నా టైమ్ ఆయేగా.. గల్లీబాయ్ చిత్రంలోని ఈ పాట ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఇదే పాటను కొద్దిగా మార్పులు చేసి తేరా టైమ్ ఆయేగా(నీ టైమ్ వస్తుంది).. అంటూ పశ్చిమ రైల్వే వినూత్న ప్రచారం చేస్తోంది. విషయం ఏంటంటే టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తూ టీటీలకు దొరక్కుండా తిరిగే వాళ్ల కోసం ఈ పాటను విడుదల చేసింది పశ్చిమ రైల్వే.
తేరా టైమ్ ఆయేగా...బినా టికెట్ ఆయా హై తో పకడా జరూర్ జాయేగా(టిక్కెట్ లేకుండా వస్తే పట్టుబడకుండా వెళ్లలేరు) అనే పంక్తులు నెటిజన్లను విపరీతంగా అలరిస్తున్నాయి. నిమిషం పాటు సాగే ఈ పాట అంతర్జాలంలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
- దీనికి మద్దతుగా కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అవుతోంది. టిక్కెట్ లేని ప్రయాణం శిక్షార్హం మాత్రమే కాదు.. సామాజిక నేరమని వివరించింది పశ్చిమ రైల్వే జోన్.