sitara

ETV Bharat / cinema

నా బయోపిక్ నేనే ​ తీస్తా... - VIJEYANDARA PRASAD

మణికర్ణిక,క్వీన్ చిత్రాలతో తనకంటూ  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్..త్వరలో తన జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తానంటోంది.

కంగనా రనౌత్

By

Published : Feb 14, 2019, 10:33 PM IST

మణికర్ణిక సినిమాతో ప్రేక్షకులను అకట్టుకుంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తన జీవితాన్ని త్వరలో సినిమాగా తెరకెక్కిస్తానని..దానికి తనే దర్శకత్వం వహిస్తానని చెప్పింది.

బాహుబలి, మణికర్ణిక చిత్రాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. అక్టోబరు-నవంబరు మధ్యలో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని చెప్పారు.

"నా జీవిత కథే నా తర్వాతి సినిమా. నేనే దర్శకత్వం వహిస్తా. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటల్ని ఇందులో పొందుపరుస్తా" - కంగనా

12 వారాల క్రితం కలిసి నా జీవిత కథను రాస్తానని విజయేంద్ర ప్రసాద్ చెప్పారని తెలిపింది కంగన. మొదట నేను భయపడ్డానని, తర్వాత ఆయన నమ్మకాన్ని చూసి అంగీకరించానని వెల్లడించింది.

"ఎటువంటి సినీ నేపథ్యం లేని ఒక అమ్మాయి..బాలీవుడ్ హీరోయిన్​గా ఎలా రాణించింది. అన్ని అవరోధాల్ని దాటుకుంటా ఉన్నత స్థానానికి ఎలా వెళ్లింది అనేదే ఈ సినిమా కథ" అని తెలిపింది కంగన.

ABOUT THE AUTHOR

...view details