sitara

ETV Bharat / cinema

'సన్నీ లియోనీ'పై ఎఫ్​ఐఆర్​ - బీహర్​లోని పబ్లిక్​ హెల్త్​ ఇంజినీరింగ్​ డిపార్టుమెంటు పరీక్ష

బిహర్​లోని పబ్లిక్​ హెల్త్​ ఇంజినీరింగ్​ డిపార్టుమెంటు పరీక్షలో సన్నీలియోనీ టాప్​ ర్యాంక్​లో నిలిచింది. అయితే ఇదంతా నకిలీదని తేలగా... దరఖాస్తు చేసిన అభ్యర్థిపై ఎఫ్​​ఐఆర్​ నమోదైంది.

'సన్నీ లియోనీ'పై ఎఫ్​ఐఆర్​

By

Published : Feb 22, 2019, 10:33 PM IST

Updated : Feb 22, 2019, 11:52 PM IST

ఇటీవల బీహార్​ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలో టాపర్​గా నిలిచిన సన్నీ లియోనీ అనే మహిళపై కేసు నమోదైంది. జూనియర్​ ఇంజినీరుగా పదవి చేపట్టాల్సిన ఆమెపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దానికి కారణం నటి సన్నీలియోనీ పేరు, ఫోటో ద్వారా నకిలీ అప్లికేషన్ సృష్టించి ఉద్యోగానికి దరఖాస్తు చేయడమే.

  • ఆమె 98.5 శాతం మార్కులతో టాపర్​గా నిలవడంపై ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ స్పందించారు. ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ప్రభుత్వం నియామకాలు ఏ తీరుగా చేస్తుందో చూడండంటూ విమర్శలు గుప్పించారు తేజస్వీ.

ఈ ఫలితాల్లో పేరు లేని ఓ అభ్యర్థి మూడో ర్యాంకు సాధించడం పట్ల సైతం నితీష్​ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తేజస్వీ యాదవ్​.

  • స్పందించిన ప్రభుత్వం ఆ అభ్యర్థులపై కేసు నమోదుకు ఆదేశించింది.
Last Updated : Feb 22, 2019, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details