54 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి మరణించారు. 22వ పెళ్లి వార్సికోత్సవానికి గుర్తుగా... జూన్ 2న శ్రీదేవీ చివరిగా సందడి చేసిన పెళ్లి వీడియోను పోస్టు చేశారు బోనీ కపూర్.
తొలి వర్ధంతి కావడంతో ప్రస్తుతం అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 24న చనిపోయినా... తిథి ప్రకారం ఆమె చనిపోయింది ఫిబ్రవరి 14 కావడంతో ఇంటి వద్దే ప్రార్ధనలు నిర్వహించారు.
- తొలి వర్ధంతికి శ్రీదేవి చీరలను వేలం వేసేందుకు నిశ్చయించారు కుటుంబసభ్యులు. వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు. వేలం నిర్వహణను పరిసెరా అనే ఆన్‌లైన్ సంస్థకు అప్పగించింది శ్రీదేవి కుటుంబం. ప్రారంభ బిడ్డింగ్ రూ.40వేలుగా మొదలై... ఇప్పటికి బిడ్ రూ.1.30లక్షల వరకు వచ్చింది.
మొదటి వర్ధంతి సందర్భంగా తల్లి శ్రీదేవిని తలుచుకొని జాన్వి బాధను వ్యక్తం చేసింది. తన తల్లి చేతిలో చేయి వేసుకొని ఉన్న పాత ఫొటోను జాహ్నవి షేర్ చేసింది.
జాన్వి సోషల్మీడియాలో పంచుకున్న ఫోటో
'నీవు లేవని గుర్తొస్తే హృదయం భారంగా ఉంటుంది. కానీ నేనెప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తాను. ఎందుకంటే అందులో నీవు ఉంటావు' అంటూ సోషల్మీడియాలో తన తల్లిపై ప్రేమను గుర్తుచేసుకుంది.