విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుంటున్న టాలీవుడ్ నటుడు అడవి శేష్. ప్రస్తుతం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా "మేజర్" అనే సినిమా రూపొందిస్తున్నారు. టైటిల్ రోల్లో శేష్ కనిపించనున్నాడు. 26/11 ముంబయి దాడుల్లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో సందీప్ వీర మరణం చెందారు. 2009లో ప్రభుత్వం ఆయనకు ఆశోక చక్ర పురస్కారం ప్రదానం చేసింది.
"మేజర్" అడవి శేష్
"గూఢచారి" అడవి శేష్..."మేజర్" అడవి శేష్‌గా మారనున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నాడీ యువహీరో.
"మేజర్" అడవి శేష్
గూఢచారి సినిమాకు దర్శకత్వం వహించిన శశికిరణ్ .. దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ, సోనీ పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో సినిమా రూపొందనుంది. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.